ప్రముఖ సీనియర్ జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్య కేసును కర్నాటక ప్రభుత్వం ప్రతిస్టాత్మకంగా తీసుకుని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కి అప్పగించింది,ఈ టీం ఇప్పుడు దానికి సంబందించిన వారందరినీ విచారణ చేస్తోంది. ఎంక్వైరీ సందర్భంగా సిట్‌కు షాకిచ్చే నిజాలు తెలిశాయి. నటుడు ప్రకాష్ రాజ్‌ను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందన్న విషయం వెలుగు చూసింది. ప్రకాష్ రాజ్ ను హత్యకు పథకం గురించి గౌరీ లంకేష్ హత్య కేసు ప్రధాన నిందితుడు పరశురామ్ వాఘ్మోర్ బయటపెట్టాడు. అంతేకాదు జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత గిరీష్ కర్నాడ్ ను కూడా హతమార్చేందుకు కుట్ర పన్నినట్టు తెలిసింది. ఈ వివరాలను సిట్ పోలీసు వర్గాలను ఉటంకిస్తూ ప్రముఖ కన్నడ టీవీ ప్రసారం చేసింది.
గౌరీ లంకేష్ హత్య తర్వాత ప్రకాష్ రాజ్ హిందూ వ్యతిరేక ప్రకటనలు చేయడమే దీనికి కారణంగా వాఘ్మోర్ తెలిపాడు. అయితే ఈ హత్యాయత్నంపై నటుడు ప్రకాష్ రాజ్ ఘాటగా స్పందించారు. ప్రజాస్వామ్యంలో భిన్నమైన అభిప్రాయం కలిగి ఉండటం సహజమన భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినంత మాత్రానా చంపాలనుకోవడం దారుణమని అన్నారు. ఇది సమస్యకు ఏమాత్రం పరిష్కారం కాదని వాస్తవానికి తాను ఏ మతానికి వ్యతిరేకమైన ఏ ప్రకటనలు చేయలేదన్నారు..అయితే మతాలను రాజకీయం చేయడాన్ని తాను వ్యతిరేకించానని వెల్లడించారు. తన స్వరాన్ని మూగబోయేలా చేద్దామనుకుంటున్నారని ఇక మీదట మరింత బలంగా మారుతుందంటూ ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు.