గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ కి తెలుగు హీరోయిన్ సపోర్ట్…

Gayatri Gupta comments on RGV God Sex and Truth Video

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీస్తున్న తాజా వీడియో గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ మీద ఇప్పటికే మహిళా లోకం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఈ పరిస్థితుల్లో టీవీ ఛానెల్స్ లో తాను చేసిన పనిని సమర్ధించుకోవడానికి వర్మ ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ఈ క్రమంలో తనని తప్పు అంటున్న కొందరు మహిళా నేతల మీద వర్మ కాస్త కటువైన భాష మాట్లాడుతున్నారు. ఈ సమయంలో ఆయన ఊహించని పరిణామం జరిగింది. తెలుగు చిత్రాల్లో నటిస్తున్న గాయత్రి గుప్తా అనే అమ్మాయి నేరుగా టీవీ 9 కి వచ్చి రామ్ గోపాల్ వర్మ కి సపోర్ట్ చేసింది.

గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ అనే వీడియో తీయడం వరకే రామ్ గోపాల్ వర్మ పని అని దాని వల్ల యువత మీద పడే ప్రభావం ఏంటి అన్నదానితో ఆయనకు సంబంధం ఏంటని గాయత్రి గుప్తా ప్రశ్నిస్తున్నారు. ఓ మనిషికి ఏమి కావాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ వుండాలని ఆమె వాదించారు. సిగరెట్ ప్యాకెట్ మీద స్మోకింగ్ ఈజ్ ఇంజురియాస్ టూ హెల్త్ అని చెప్పడం వల్ల ఎందరు మానేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. అందువల్ల కట్టుబాట్ల వల్ల ఏదో జరుగుతుందని అనుకోవడం మంచిది కాదని గాయత్రి గుప్తా వాదన. వర్మ వీడియో వల్ల అయినా సెక్స్ మీద విస్తృతంగా చర్చ జరగడం మంచిదేనని గాయత్రి గుప్తా ఆలోచన. ఈ డిస్కషన్ లో గాయత్రి గుప్తా కి ఊహించని షాక్ తగిలింది. ఈ చర్చలో పాల్గొన్న ఓ మహిళ రాముని సపోర్ట్ చేసే గాయత్రి గుప్తా బట్టలు విప్పి రావచ్చు కదా అని నిలదీశారు. ఏదేమైనా వర్మ కి అనుకూలంగా ఓ తెలుగు అమ్మాయి మాట్లాడ్డం ఆశ్చర్యకరమే.