వాళ్ళు దేవుళ్ళు అయితే మోహన్ బాబు కూడా దేవుడే.

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

 Gayatri Official Teaser review

మోహన్‌బాబు వారసులుగా విష్ణు, మనోజ్‌, మంచు లక్ష్మిలు వెండి తెరపై సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన హీరోగా నటించేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అప్పుడప్పుడు క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటిస్తున్న మోహన్‌బాబు చాలా కాలం తర్వాత పూర్తి స్థాయి హీరోగా నటించాడు. ‘గాయత్రి’ టైటిల్‌తో మదన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం టీజర్‌ను సంక్రాంతి సందర్బంగా విడుదల చేశారు. మంచు విష్ణు ఒక ముఖ్యమైన పాత్రలో నటించడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలను పెంచే విధంగా టీజర్‌ ఉంది. మంచు ఫ్యాన్స్‌ను ఫిదా చేసేలా ఉన్న ‘గాయత్రి’ టీజర్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ హల్‌ చల్‌ చేస్తోంది.

మోహన్‌బాబు వయస్సుకు తగ్గ పాత్రను చేశాడు. చాలా స్టైలిష్‌గా మోహన్‌బాబు ఈ చిత్రంలో కనిపిస్తున్నాడు. ఇక టీజర్‌లో వినిపించిన డైలాగ్‌ ప్రస్తుతం అందరికి పిచ్చెకిస్తోంది. రామాయణం మరియు మహాభారతంలో యుద్దాల్లో లక్షలాది మంది చనిపోయారు. అయినా కూడా రాముడు, కృష్ణుడులను దేవుడు అంటున్నారు. వారు దేవుళ్లు అయినప్పుడు నేనూ దేవుడినే అంటూ మోహన్‌బాబు చెబుతున్న డైలాగ్‌ అందరిలో ఆలోచనను రేకెత్తిస్తోంది.

అద్బుతమైన స్క్రీన్‌ప్లేతో మదన్‌ ఈ చిత్రాన్ని తనదైన శైలిలో తెరకెక్కించాడు అంటూ సమాచారం అందుతుంది. ప్రస్తుతం చివరి దశ చిత్రీకరణ జరుపుకుంటున్న ‘గాయత్రి’ చిత్రంను వచ్చే నెల 9న విడుదల చేయబోతున్నారు. శ్రియ ముఖ్య పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో నిఖిలా విమల్‌ అనే హీరోయిన్‌ ప్రేక్షకులకు పరిచయం కాబోతుంది. మంచు విష్ణు, మోహన్‌బాఋ కలిసి చేస్తున్న ఈ చిత్రం ఎలా ఉంటుందో చూడాలి అంటే మరో నెల రోజులు ఆగాల్సిందే.