లీక్‌ వల్ల మంచే జరిగింది…!

Geetha Govindam Movie Leak Was Very Lucky

గీత గోవిందం చిత్రం విడుదలకు ముందే కీలక సీన్స్‌ లీక్‌ అయిన విషయం తెల్సిందే. సినిమాకు సంబంధించిన దాదాపు 90 నిమిషాల వీడియోను గుర్తు తెలియని హ్యాకర్‌ గూగుల్‌ డ్రైవ్‌లో పోస్ట్‌ చేయడం జరిగిందని ప్రచారం జరిగింది. లీక్‌ అయిన సీన్స్‌ సినిమాపై ఆసక్తి తగ్గించే అవకాశం ఉందని చిత్ర యూనిట్‌ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. కాని అనూహ్యంగా సినిమా సూపర్‌ హిట్‌ అవ్వడానికి లీక్‌ సీన్స్‌ కూడా ఉపయోగపడ్డట్లుగా సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొదటి రోజు దాదాపుగా 10 కోట్ల షేర్‌ను సాధించింది అంటే ఖచ్చితంగా లీక్‌తో వచ్చిన హైప్‌ అంటూ చెప్పుకోవచ్చు.

geetha-govindham

విజయ్‌ దేవరకొండ గత చిత్రం అర్జున్‌ రెడ్డి సూపర్‌ హిట్‌ అవ్వడంతో సహజంగానే సినిమాపై అంచనాలు భారీగా ఉంటాయి. కాని సినిమా విడుదలకు ముందే లీక్‌ అవ్వడం వల్ల ప్రేక్షకులు సినిమాలో ఇంకా ఎంత మ్యాటర్‌ ఉంటుందో అనే ఉత్సుకతను వ్యక్తం చేశారు. అందుకే సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు పరుశురామ్‌ మంచి స్క్రీన్‌ప్లేతో సినిమాను నడిపించిన కారణంగా ప్రేక్షకులు గీత గోవిందంపై కలెక్షన్స్‌ వర్షం కురిపిస్తున్నారు. మొదటి రోజు మాత్రమే కాకుండా రెండవ రోజు కూడా అదే స్థాయిలో వసూళ్లను రాబట్టింది. లీక్‌ వల్ల సినిమా స్థాయి తగ్గడం అంటూ జరగడదని మరోసారి గీత గోవిందం నిరూపించింది. పైరసీ కూడా సినిమా బాగుంటే ఏమీ చేయలేదు అని చెప్పకనే చెప్పింది.

vijay-devarakonda