డ్యూటీ చేస్తున్నారా, డుమ్మా కొట్టారా.. అసలు డ్యూటీ టైమ్ లో ఎవరెక్కడ ఉన్నారు.. ఇవి నేరుగా తెలుసుకోవటం కష్టమే, ఒక్కో ఉద్యోగికి జియో ట్యాగ్ వేస్తే.. ఇంకేముంది ఫుల్ డాటా రెడీ అవుతోంది.. ఈ ఆలోచన ఆయుష్ డిపార్ట్మెంట్ లో అమలు చేసేందుకు సిద్ధం అయ్యారు..
అయితే పశువులకు, వాహనాలకు వేసే జియో ట్యాగింగ్ తమకు ఎలా వేస్తారంటూ డాక్టర్లు మండి పడతున్నారు. వైద్య ఆరోగ్య శాఖలోని ఆయుష్ విభాగపు వైద్య సిబ్బందికి జియో ట్యాగింగ్ చేయాలని ఆ శాఖ కమిషనర్ అలుగు వర్షిణి నిర్ణయించారు. ఒక శాఖ సిబ్బందికి జియో ట్యాగింగ్ చేయాలని నిర్ణయించడం బహుశా దేశంలోనే ఇదే తొలిసారి. ఆయుష్ వైద్య సిబ్బంది విధులకు డుమ్మా కొట్టకుండా పక్కాగా ఆస్పత్రికి వచ్చేందుకే దీనిని అమలు చేస్తున్నట్లు చెప్తున్నారు..