ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఏ తో పాటూ నెయ్యిలో ఉన్న అనేకమైన ఆరోగ్య ప్రయోజనాలు చపాతీ, కిచిడీ, పూర్ణం బూరెలు, పప్పన్నం, పొంగలి.. వీటన్నింటికీ నెయ్యి కావలసిందే, నెయ్యి లేకపోతే వీటికి రుచి రాదు. అయితే, రుచి మాత్రమే కాదు, నెయ్యికి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. వాటినిప్పుడు చూసేద్దాం.
శీతాకాలం వచ్చినా, వానలు విస్తారంగా పడుతున్నా మనలో చాలా మందికి గొంతు గరగరలూ, దగ్గూ సామాన్యంగా ఉంటాయి. చాలా వరకూ, ఇది మాత్ర వేసుకునేంత పెద్దదీ కాదు, వదిలేసేంత చిన్నదీ కాదులా ఉంటుంది. అలాంటప్పుడు కొద్దిగా గోరు వెచ్చని నెయ్యి ఒక టీ స్పూను తీసుకుంటే సరిపోతుంది.ఆయుర్వేదం ప్రకారం కంటి చూపు చక్కగా ఉండాలంటే, వివిధ రకాల సమస్యల నుండి కళ్ళు రక్షింపబడాలంటే నెయ్యి ఎంతో అవసరం. ఈ కంప్యూటర్ కాలంలో నెయ్యి ఎంత అవసరమో కదా..
మారిన జీవన శైలి వల్ల ఈ మధ్య కాలం లో ఎక్కువ మంది ఈ సమస్య తో బాధపడుతున్నారు. దీనికి నెయ్యి ఎంతో బాగా పని చేస్తుంది. రాత్రి నిద్రకి ముందు కొద్దిగా నెయ్యి తీసుకుంటే సరి. సమస్య పరిష్కారమయిపోతుంది.నెయ్యికి యాంటీ ఇంఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయని స్టడీస్ చెబుతున్నాయి. నెయ్యి శరీరంలో మంచి కొలెస్ట్రాల్ నిల్వలని పెంచుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.
నెయ్యిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి మీ రోగనిరోధక శక్తికి తగినంత బలాన్ని చేకూర్చి పోషకాలని గ్రహించేలా చేస్తాయి. ఫలితంగా, అనారోగ్యం బారిన పడే రిస్క్ గణనీయంగా తగ్గుతుంది.నెయ్యి వల్ల హెల్దీ ఫ్యాట్స్ పెరుగుతాయి. అంటే, గుండె పదిలంగా ఉన్నటే. అంతే కాక, నెయ్యి బరువు తగ్గడానికి కూడా హెల్ప్ చేస్తుంది.ఇదంతా చదివిన తరువాత ఒక సందేహం రావడం సహజం. ఎంత నెయ్యి తీసుకోవాలి? అది కూడా ఇక్కడే చదివేయండి మరి.
సింపుల్ గా చెప్పాలంటే, ఆరోగ్యానికి సరిపోయినంత, ఆహారం రుచిని పెంచేంత మాత్రం తీసుకోవాలి. అంటే, నెయ్యి ఎంత తీసుకోవాలి అనేది ఆ ఆహార పదార్ధం బట్టి ఉంటుంది. ఇది మనకి తెలిసిందే. చపాతీ మీద రాసే నెయ్యి కన్నా సున్నుండల్లో ఎక్కువ నెయ్యే పడుతుంది కదా. అయితే, ఒకటే సూత్రం ఏమిటంటే, నెయ్యి వల్ల ఆ ఆహార పదార్ధం రుచి పెరగాలి, అంతే కానీ నెయ్యి రుచి మాత్రమే తెలిసేంత నెయ్యి మాత్రం వాడకూడదు.
నెయ్యికి ఉన్న వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకుని నెయ్యిని కనీసం రోజులో ఒక భోజనం లో అయినా తీసుకుంటే మంచిది. రోజుకి ఒక వ్యక్తి మూడు నుండి ఆరు టీస్పూన్ల నెయ్యి తీసుకోవచ్చు. అంటే, బ్రేక్ ఫాస్ట్ లో ఒక టీ స్పూన్, లంచ్ లో ఒక టీ స్పూన్, డిన్నర్ లో ఒక టీ స్పూన్ నెయ్యి తీసుకుంటే సరిపోతుందన్న మాట.