తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించినా కూడా నిరుద్యోగ తీవ్రత పీడిస్తూనే ఉంది. ఉద్యోగం దొరక్క ఓ యువతి ఏకంగా కాల్‌గర్ల్‌గా మారింది. వరంగల్ జిల్లాకు చెందిన ఓ యువతి.. చేష్టలు చూసి భర్త ఖంగుతిన్నాడు. పోర్న్ సైట్లో వీడియోలు చూసి భర్త షాక్ కు గురయ్యాడు. తెలియక చేసిన ఓ పని ఆ యువతి జీవితానికి తంటాలు తెచ్చిపెట్టాయి.
యువత చదువుకున్నా.. ఒక్కోసారి అజ్ఞానపు కోరల్లో చిక్కుకుంటుంది. మాయమాటలు, ప్రలోభాలకు లొంగిపోయి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వరంగల్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ యువతి ఉద్యోగం దొరక్క అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడి ఇప్పుడు ఫలితం అనుభవిస్తోంది. పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిన తర్వాత ఆమె చేసిన పనులు బయట పడటంతో భర్త చేతిలో చిత్రహింసలు అనుభవిస్తోంది.
అసలు విషయం ఏమిటంటే.. వరంగల్ నగరానికి చెందిన ఓ యువతి కొన్నాళ్ల క్రితం బీటెక్ పూర్తి చేసి ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చింది. లేడీస్ హాస్టల్లో చేరి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. నెల రోజులైనా ఉద్యోగం దొరక్కపోవడంతో యువతి నిరాశకు లోనైంది. దీంతో ఓ ఆంటీతో ఆమెకు పరిచయం ఏర్పడింది. బీటెక్ చదివినా ఉద్యోగం రావడం లేదని.. ఏం చేయాలో తెలియడం లేదని ఆమె వద్ద యువతి ఆవేదన వ్యక్తం చేసింది.
ఆ యువతి అవసరాన్ని ఆసరాగా తీసుకున్న ఆ మహిళ ఆమెను వ్యభిచార కూపంలోకి దించింది. ‘అందంగా ఉన్నావ్.. నీకు ఉద్యోగం అవసరామా.. నీ శరీరంతో వ్యాపారం చేస్తే చాలా సులువుగా డబ్బు సంపాదించుకోవచ్చు’ అంటూ సలహా ఇచ్చింది. ఉద్యోగం దొరక్క ఎంతో నిరాశలో ఉన్న ఆమెకు ఆంటీ సలహా నచ్చి సాఫ్ట్వేర్ ఉద్యోగులతో సన్నిహితంగా మెలగడం స్టార్ట్ చేసింది. తనకు మంచి జీతంతో జాబ్ వచ్చిందని కుటుంబ సభ్యులకు చెప్పి లగ్జరీ లైఫ్‌కు అలవాటు పడింది.
అయితే ఆ తర్వాత ఆమెకు.. తల్లిదండ్రులు అమెరికాలో ఉద్యోగం చేసే యువకుడితో వివాహం కుదుర్చుకున్నారు. పెళ్లి చేసుకుని కొద్ది రోజులకే ఆమె భర్తతో కలిసి విదేశాలకు వెళ్లిపోయింది. ఆ యువతి భర్తకు పోర్న్ వీడియోలు చూడటం అలవాటు. ఓ రోజు తన మొబైల్లో పోర్న్ వీడియో చూస్తుండగా.. తన భార్య పరాయి వ్యక్తితో సెక్స్ చేస్తున్న వీడియో చూసి షాక్ కు గురయ్యాడు. దీనిపై భార్యను నిలదీయగా తనకే పాపం తెలీదని చెప్పి ఊపిరి పీల్చుకుంది. కానీ.. ఆమెకు తాను హైదరాబాద్‌లో చేసిన బాగోతం గుర్తొచ్చి తన జీవితం నాశమౌతుందేమోనని భయపడింది. అయితే భార్య తనను మోసం చేసిందని గ్రహించిన అతడు ఆమెను తరుచూ వేధించడం స్టార్ట్ చేశాడు.
ప్రతిరోజూ ఆఫీసు నుంచి ఇంటికి రాగానే కొడుతూ నానారకాలుగా హింసించేవాడు. భర్త పెట్టే హింసలను సెల్పీ వీడియో తీసి వరంగల్ లోని కుటుంబ సభ్యులకు పంపించింది. వారి సలహా మేరకు పోలీసులను ఆశ్రయించింది. దీంతో భర్తపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భర్త నుంచి తనకు ప్రాణహాని ఉందని గ్రహించిన ఆమె ఇంటికి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న టైంలో కరోనా వైరస్ తో విమాన సర్వీసులన్నీ రద్దయ్యాయి. దీంతో తెలిసిన వారింట్లో కొద్ది రోజులుగా ఆశ్రయం పొందుతోంది. లాక్డౌన్ పూర్తి కాగానే ఇంటికి వచ్చేయాలని కుటుంబసభ్యులు ఆమెకు చెప్తున్నారు. కాగా ఉద్యోగం కోసం ఒంటరిగా నగరానికి వచ్చే యువత మోసగాళ్ల వలలో చిక్కితే అంతేమరి.