ఆ దేశాలవి అసలైన డేటా కాదు: ట్రంప్ వినూత్న నిరసన

విశ్వాన్ని వణికించేస్తున్న వైరస్ కోరనా. దీని దెబ్బకు ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలం అయిపోతున్నాయి. అయితే ఇప్పుడు కొన్ని దేశాలు నిజంగా కోరనా బారినపడ్డ వారి సంఖ్య వెల్లడించడం లేదు. ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మండిపడుతున్నారు. అసలు మిగతా దేశాలతో పోలిస్తే అమెరికాలో ఈ కరోనా వైరస్ అమిత వేగంగా విస్తరిస్తోంది. మరణాల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతుంది. దీనిపై అమెరికా అనేక ఆరోపణలు చేస్తుంది.

అమెరికా మాత్రమే ఖచ్చితమైన డేటాను ఇస్తోందని, ఇంఫెక్షన్ సోకిన వివరాలు, మరణాల సంఖ్యను నిజాయితీగా ప్రకటిస్తోందనని అంటున్నారు అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్. అయితే ఇదే సమయంలో  చైనా, రష్యా, ఇరాన్, నార్త్ కొరియా వంటి చాలా దేశాలు అసలైన డేటాను బయటపెట్టడం లేదని.. తప్పుడు డేటాను ఇస్తున్నాయని ట్రంప్ వినూత్నంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిజమే కదామరి… నిజం నిప్పులా ఉండాలి కదామరి.  కాగా కరోనా వైరస్ పై ప్రపంచదేశాలు భారీ ఎత్తున యుద్ధం చేస్తున్నాయి. కరోనా కారణంగా ఎవరూ బయటకు రావడం లేదు అన్నది నిజం. కరోనా వైరస్ కు సరైన మందు లేకపోవడంతో ఎన్నో లక్షల మంది.. వైరస్ బారిన పడుతున్నారు. కరోనా కారణంగా వేలమంది మరణిస్తున్నారు. చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ వైరస్ అక్కడి నుంచి ప్రపంచం మొత్తం విస్తరించింది.