జాగ్రత్తలు తీసుకుంటున్న ప్రభాస్

జాగ్రత్తలు తీసుకుంటున్న ప్రభాస్

ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఓ డియర్ చిత్రం ఇంకా ఫస్ట్ లుక్ కూడా విడుదల కాలేదు. ఈ చిత్ర టైటిల్ కూడా చిత్ర యూనిట్ విడుదల చేయలేదు. అయితే ఇటీవల షూటింగ్ ముగించి కొని భారత్ కి తిరిగి వచ్చిన చిత్ర యూనిట్ ప్రభాస్ ఫస్ట్ లుక్ పై ఒక ఆసక్తికర విషయం తెలిపింది. కరోనా వైరస్ ప్రభావం తగ్గిన తర్వాత లేదంటే లాక్ డౌన్ ముగిసిన అనంతరం ప్రభాస్ ఫస్ట్ లుక్ విడుదల అయ్యే అవకాశం ఉందని తెలిపారు. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ నీ మే మూడు వరకు పొడిగించారు. అయితే ఈ విషయంలో చిత్ర యూనిట్ చాలా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రభాస్ సాహొ చిత్రం విషయంలో జరిగిన తప్పులు రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకే ఫస్ట్ లుక్ విషయంలో కూడా ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం లేదు. అందుకే లాక్ డౌన్ ముగిసిన అనంతరం మే నెలలో ప్రభాస్ చిత్రానికి సంబంధించిన అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. అంతేకాక ఈ చిత్రం పై ప్రభాస్ కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు. సా హొ చిత్రం నిరాశ పరచడంతో ఈసారి అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చేలా ప్రభాస్ ఆలోచిస్తున్నారు. ఈ చిత్రం విషయంలో ఎలాంటి తప్పు జరగకుండా ప్రభాస్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే ఈ చిత్రంలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తుంది. ఈ చిత్రం భారీ బడ్జెట్ చిత్రంగా, పాన్ ఇండియా తరహాలో విడుదల కానుంది.