ప్రేమించిన అమ్మాయే అతని పాలిత మృత్యువు అయ్యింది. పెళ్లి చేసుకోను అని అతను సరదాకి అన్న మాటలు సీరియస్ గా తీసుకున్న ఆమె అతని ఉసురు తీసింది. అత్యంత విషాదకరమైన ఈ ఘటన అనంతపురం జిల్లా లో తిమ్మలాపురం గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు గ్రామానికి చెందిన ఉపాధి హామీ మేట్ మోహన్ ఈ నెల 5న రాత్రి అనుమానాస్పద స్థితిలో ఒక గ్రామంలో పడి ఉన్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అతని వివరాలు సేకరించగా పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొద్ది రోజులుగా మోహన్ రాయాపురానికి చెందిన మమతతో ప్రేమలో ఉన్నాడు.
ఈక్రమంలో మమత తనను పెళ్లి చేసుకోమని మోహన్‌ను కోరగా ఆమెను ఆట పట్టించడానికి చేసుకోను అంటూ సమాధానం చెప్పేవాడు. ఇది నిజమేనని నమ్మిన మమత కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ యువకుడితో పెళ్లి నిశ్చయం చేసుకుంది. దీంతో తాను సరదాగా అన్న మాటలను సీరియస్ గా తీసుకుని పెళ్లి చేసుకోవడం ఏమిటని మోహన్ మద్యం వెళ్లి తరచూ ఆమెతో గొడవ పడేవాడు. రోజూ లాగానే ఈ నెల 5న కూడా మోహన్ తన ఇంటికి ఎదురుగా ఉంటున్న మమత ఇంటికి వెళ్లి తననే పెళ్లి చేసుకోవాలని కోరాడు. ఆమె నిరాకరించడంతో మోహన్ మమత చున్నీని మెడకు చుట్టుకుని నువ్వు లేకుండా నేను బతకలేను నన్ను చంపేయమని కోరాడు.
తాను మనిషిననే విచక్షణ కోల్పోయిన మమత అతన్ని అడ్డు తొలగిస్తే తనకు ఇబ్బంది ఉండదనుకుంది. దీంతో ఆమె తన అక్క పవిత్ర సహాయం కూడా అర్ధించి ఇద్దరు కలిసి చున్నీని గట్టిగా అతడి గొంతుకు బిగించడంతో ఊపిరాడక మృతిచెందాడు. వెంటనే అతని మృతదేహాన్ని అతడి ఇంటికి వరకు ఈడ్చు కెళ్ళి పడేశారు. ఈ విషయం ఎవరికీ తెలియదులే అనుకున్నారు, కానీ మృతుని తండ్రి పోలీసు కంప్లైంట్ ఇవ్వడంతో వారు తీగ లాగితే ఈ విషయాలన్నీ వేలుగులికి వచ్చాయి. అయితే కోర్టు వారికి రిమాండ్ విధించిది అందులో పవిత్రకు మూడు నెలల పాప ఉండడంతో తల్లి బిడ్డలను విడదీయలేని పరిస్థితుల్లో ఆ పసిగుడ్డును కూడా జైలుకు తీసుకెళ్ళారు.