పార్టీ ఆఫీస్ లోనే రేప్…కలకలం ?

Girl Gang Raped In Guntur

ఎన్నికల వేళ పార్టీ కార్యాలయంలోనే ఓ విద్యార్థి సంఘం నేత తన మీద అత్యాచారం చేశారంటూ యువతి చేసిన ఆరోపణలు కేరళలో దుమారం రేపుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల వేళ ఆ రాష్ట్రంలో అధికార సీపీఎం పార్టీకి ఈ వ్యవహారం పెద్ద సమస్యగా మారింది. పాలక్కడ్ జిల్లా చెరుప్లాసరీ పట్టణంలోని సీపీఎం కార్యాలయంలో 10 నెలల కిందట తన మీద అత్యాచారం చేసారని దుర్మార్గుడి పాపానికి తనకు బిడ్డ జన్మించిందని బాధితురాలు కన్నీళ్లు పెట్టుకుంది. గత శనివారం రాత్రి రోడ్డు పక్కన అప్పుడే పుట్టిన శిశువు రోదనలు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకొని శిశువును సంరక్షణా కేంద్రానికి తరలించారు. ఆ తర్వాత చాలా శ్రమించి చిన్నారి తల్లిని గుర్తించారు. శిశువును వదిలేయడానికి కారణాలేమిటని ఆరా తీస్తున్న క్రమంలో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. విచారణలో బాధితురాలు సంచలన వివరాలను తెలిపింది. 10 నెలల కిందట సీపీఎం ఆఫీసులో తనపై రేప్ జరిగిందని చెప్పింది. కాలేజీ మ్యాగజైన్ పని మీద అక్కడికి వెళ్లగా ఓ విద్యార్థి సంఘం నేత బంధించి అత్యాచారం చేశాడని వెల్లడించింది. ఆమె వాంగ్మూలం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల వేళ ఈ వ్యవహారం కేరళ రాజకీయాల్లో అగ్గి రాజేస్తోంది. అధికార సీపీఎం పార్టీపై కాంగ్రెస్ నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు. సాక్షాత్తు పార్టీ కార్యాలయంలోనే రేప్‌లు జరుగుతున్నాయంటే వామక్షాల పాలన ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని విమర్శలు గుప్పిస్తున్నారు.