ఆస్తా వర్మ అనే యువతి తన తల్లి కొరకి వరుడి కోసం సోషల్ మీడియాను వేదికగా తోడును వెదికేందుకు సన్నాహాలు చేస్తుంది. తాను పెళ్లి చేసుకుని వెళ్లిపోతే ఆస్తా వర్మ తల్లి మరో సారి ఒంటరిగా అవ్వాల్సి వస్తుందని తోడు వెతికేందుకు ప్రయత్నాలు చేస్తుంది.
తన అమ్మ కోసం యాభై ఏళ్ల అందమైన వరుడు కావాలి, వెజిటేరియన్ అయి ఉండి తాగుడు అలవాటు ఉండకుండా జీవితంలో స్థిరపడినవాడు అయి ఉండాలి అని కూతురు ఆస్తా వర్మ ట్వీట్ చేసింది. తల్లితో పాటు కలిసి ఉన్న సెల్ఫీని ట్విటర్‌లో షేర్ చేసింది. ఆస్తా చేసిన ట్వీట్ కి నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది.
పలువురు ఆస్తా వర్మను ప్రశంసిస్తూ ప్రతీ ఒక్క వ్యక్తికి తోడు అవసరం, గొప్ప కూతురువి ఇంకా తల్లీకూతుళ్లు ఇద్దరూ స్నేహితుల్లా ఉన్నారని కామెంట్లలో చెప్తున్నారు.