గోదావరి జిల్లాల్లో ఏ పార్టీ గాలి తోలితే రాష్ట్రంలో ఆ పార్టీకి అధికార పీఠం దక్కుతుందన్నది ఎప్పటి నుంచో వస్తున్న సంప్రదాయం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కొనసాగిన ఈ సెంటిమెంట్ రాష్ట్ర విభజన తర్వాత కూడా నిరూపితమైంది. 2014 ఎన్నికల్లో గోదావరి మనసు గెల్చుకున్న టీడీపీ ఏపీ అధికార పగ్గాలు అందుకుంది. ఐదేళ్లు గడిచిపోయాయి. 2019 ఎన్నికలు కూడా ముగిసాయి. అయితే ఈసారి గోదావరి ఓటరు గుట్టుగా వున్నాడు. గుంభనగా ఓటేశాడు. ఆ ఓటు ఎవరికి పడిందో ? . అధికార రేసులో కొనసాగుతున్న టీడీపీ , వైసీపీ తో పాటు జనసేన సైతం ఇక్కడ ఓటరు తీర్పు తమకు అనుకూలంగా ఉంటుందన్న ధీమాతో వున్నాయి.
ఆ మూడు పార్టీల ధీమా వెనుక ఒక్కోరిదీ ఒక్కో కారణం. టీడీపీ పూర్తిగా ప్రభుత్వ పధకాలు, అభివృద్ధి అనే జంట అస్త్రాలను నమ్ముకుంది. ఇక వైసీపీ ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు నవరత్నాల మేనిఫెస్టో ని నమ్ముకుంది. జనసేన కొత్త తరహా రాజకీయాలు , మార్పు అన్న నినాదాలపై విశ్వాసం ఉంచింది. ఇవన్నీ పైపైన కనిపిస్తున్న దృశ్యం. ఆ సన్నటి తెర తీస్తే ఈసారి గోదావరి జిల్లాల్లో ఎన్నికల సందర్భంగా కుల రాజకీయాల మీద ఇంతకు ముందు ఎప్పుడూ లేనంతగా చర్చ సాగింది. అయితే అది చర్చ దగ్గరే ఆగింది. ఓటు వేసేటప్పుడు ఆ ప్రభావం నామ మాత్రమే అని తేలింది. గోదావరి జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాల్లో కాపు , ఎస్సీల మధ్య రాజకీయ వైరుధ్యం తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ బీఎస్పీ తో పొత్తు పెట్టుకోవడం తో క్షేత్ర స్థాయిలో ఆసక్తికర కాంబినేషన్ లకి దారి తీసింది.
కాపు రిజర్వేషన్ ఉద్యమం ద్వారా ముద్రగడ రాజకీయ ముద్ర వేయడానికి చేసిన ప్రయత్నం టీడీపీ వ్యతిరేకత పెంచడానికి ఓ మేరకి పనిచేసినా అదే గోదావరి జిల్లాల్లో కాపు రిజర్వేషన్ సాధ్యం కాదని చెప్పడంతో తో జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ మీద తీవ్ర వ్యాఖ్యలతో వైసీపీ అధినేత జగన్ ఆ వాతావరణాన్ని చెడగొట్టుకున్నారు. జనసేన మీద నమ్మకం కుదరక అటు టీడీపీ , వైసీపీ ల్లో ఎటు మొగ్గాలో తెలియక కాపు ఓటరు కాస్త సమయంలో పడ్డ మాట నిజం. ఈ ప్రభావం కాపు అనుకూల , వ్యతిరేక రాజకీయాలు చేసే ఇంకొన్ని వర్గాల మీద కూడా పడింది. దీంతో ఎన్నికల వేళ గోదావరి జిల్లాల్లో ఈసారి సందడి కన్నా సంశయమే రాజ్యం ఏలింది. కానీ పోలింగ్ పూర్తి అయ్యాక వారి మనోగతాన్ని విన్నప్పుడు ఆ ప్రభావం నుంచి ఓటరు బయటపడి తన నిర్ణయాన్ని ప్రకటించాడని తెలుస్తోంది.
తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం స్థానాలు : 19
టీడీపీ గన్ షాట్ గా గెలిచే స్థానాలు : 9 …
- పిఠాపురం,
- కాకినాడ అర్బన్,
- రామచంద్రపురం,
- ముమ్మడివరం,
- అమలాపురం,
- రాజోలు,
- రాజానగరం,
- రాజమండ్రి సిటీ,
- జగ్గంపేట
వైసీపీ కచ్చితంగా గెలిచే స్థానాలు : 6
- ప్రత్తిపాడు
- కాకినాడ రూరల్
- అనపర్తి
- p గన్నవరం
- కొత్తపేట
- రంపచోడవరం
పోటాపోటీ స్థానాలు : 4
- తుని
- మండపేట
- రాజమండ్రి రూరల్
- పెద్దాపురం.
గట్టి పోటీ సాగిన 4 నియోజకవర్గాలకు గాను మూడు చోట్ల టీడీపీ అతి స్వల్ప మెజారిటీతో గెట్టేక్కే ఛాన్స్ వుంది. మండపేట , పెద్దాపురం , రాజమండ్రి రూరల్ లో టీడీపీ కి గెలుపు దక్కినా తుని లో అనూహ్యంగా జనసేన అభ్యర్థి కొద్ది తేడాతో గెలవొచ్చు.
ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో పరిస్థితి ఎలా వుందో చూద్దాం.
మొత్తం స్థానాలు : 15 .
టీడీపీ గెలిచేవి : 9 ..
( నిడదవోలు ,ఆచంట ,నర్సాపురం , ఉండి, తణుకు, ఉంగుటూరు , దెందులూరు ,ఏలూరు , గోపాలపురం )
వైసీపీ గెలిచేవి : 1
(చింతలపూడి )
పోటాపోటీ : 5 .(కోవూరు ,పాలకొల్లు , భీమవరం , తాడేపల్లిగూడెం ,పోలవరం )
గట్టి పోటీ జరిగిన ఐదు స్థానాల్లో కొవ్వూరు , పోలవరంలో టీడీపీ , పాలకొల్లు , తాడేపల్లిగూడెం లో వైసీపీ , భీమరవరం లో జనసేన కొద్దిపాటి మెజారిటీ తో గట్టెక్కవచ్చు.
ఇక సోమవారం నాడు దక్షిణ కోస్తా ఓటరు నాడి ఎలా వుందో తెలుసుకుందాం.