బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. మీకోసం అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. పసిడి కొనుగోలుపై భారీ తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. అయితే మీరు ఆన్లైన్లో బంగారం కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
కల్యాణ్ జువెలర్స్‌కు చెందిన క్యాండేరె బ్రాండ్ కస్టమర్ల కోసం బంగారు నగలపై తయారీ చార్జీల్లో తగ్గింపు అందిస్తోంది. ఏకంగా 55 శాతం వరకు డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. దీని వల్ల బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ప్రయోజనం కలుగనుంది.
లవ్ ఆఫ్ లప్పా గోల్డ్ నెక్లెస్‌పై తయారీ చార్జీల్లో 55 శాతం తగ్గింపు లభిస్తోంది. దీని ధర రూ.70,531. అయితే మీరు ఆఫర్ కింద రూ.57,615కే ఈ నెక్లెస్‌ను కొనుగోలు చేయొచ్చు. అంటే మీరు దాదాపు రూ.13 వేలు ఆదా చేసుకోవచ్చని చెప్పొచ్చు.
ధర బ్రేకప్ విషయానికి వస్తే.. మెటల్ ధర రూ.45,677. తయారీ చార్జీలు రూ.22,800 అయితే డిస్కౌంట్ పోతే రూ.10,260 అవుతాయి. ఇక జీఎస్టీ రూ.1678. మీరు 18 క్యారెట్ గోల్డ్ నెక్లెస్. దీని బరువు 12 గ్రాములు. ఇకపోతే తగ్గింపు పొందాలంటే కొనుగోలు సమయంలో మెగా అనే కూపన్ కోడ్ ఉపయోగించాలి.