నేలచూపులు చూస్తున్న పసిడి

నేలచూపులు చూస్తున్న పసిడి

బంగారం ధర తగ్గింది. వెలవెలబోయింది. నిన్న పైకి కదిలిన పసిడి ఈరోజు నేలచూపులు చూసింది. బంగారం ధర తగ్గితే.. వెండి రేటు మాత్రం పైకి కదిలింది. గ్లోబల్ మార్కెట్‌లో కూడా ఇదే ట్రెండ్ నడిచింది.

బంగారం ధర వెలవెలబోయింది. పసిడి పరుగుకు బ్రేకులు పడ్డాయి. నిన్న పెరిగిన బంగారం ధర ఈరోజు మాత్రం నేలచూపులు చూసింది. బంగారం ధర దిగివస్తే.. వెండి రేటు మాత్రం పరుగులు పెట్టింది. వరుసగా రెండో రోజు కూడా వెండి పైకి కదిలింది.

హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.160 దిగొచ్చింది. దీంతో బంగారం Gold ధర రూ.47,130కు తగ్గింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.150 తగ్గుదలతో రూ.43,200కు క్షీణించింది.

బంగారం ధర తగ్గితే.. వెండి రేటు మాత్రం పైకి కదిలింది. రూ.300 పెరిగింది. దీంతో కేజీ వెండి Silver ధర రూ.64,700కు చేరింది. వెండి పట్టీలు, కడియాలు, ఆభరణాలు కొనాలనుకునే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు.

మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది. ఔన్స్‌కు 0.20 శాతం దిగొచ్చింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1733 డాలర్లకు తగ్గింది. వెండి రేటు మాత్రం పైకి కదిలింది. ఔన్స్‌కు 0.01 శాతం పెరుగుదలతో 22.46 డాలర్లకు చేరింది.