Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సాధారణంగా బాబాలంటే సన్యాసం తీసుకున్నవారే అయ్యుంటారు. కఠోర సాధన చేశాకే బాబాగా పిలవడం పాత పద్ధతి. ఎప్పుడు ఎలాంటి అర్హత లేకపోయినా.. ఏదో వెరైటీ చూసి బాబాగా చలామణీ అయిపోతున్నారు చాలా మంది. ఇప్పుడు మనం చెప్పుకునేది కూడా అలాంటి వారి గురించే గోల్డ్ బాబాగా అందూ పిలిచే ఈ బాబా స్పెషల్ బంగారమే.
ఒంటి మీద పది పదిహేను కేజీల బంగారం లేనిదే ఈయన మఠం కదలరట. సాధారణంగా ఎన్ని నగలున్న వాళ్లైనా ఫంక్షన్లప్పుడే పెట్టుకుంటారు. రోజువారీ వ్యవహారాల్లో వీటిని వేసుకుని తిరగరు. కానీ బాబాకు బంగారం పిచ్చి ఉంది కాబట్టి.. ఏకంగా 200 కిలోమీటర్ల యాత్రలో కూడా అన్నేసి కేజీల బంగారం ధరించి ఫోటోలకు పోజులిస్తున్నారు. అసలు కాంచనం అంటే ఇంత కాంక్ష ఉన్న బాబాను జనం నమ్మడం ఇంకా ఆశ్చర్యమే.
ఏటా హరిద్వార్ నుంచి ఢిల్లీ వరకు 200 కిలోమీటర్ల మేర కన్వర్ యాత్ర సాగుతుంది. ఇందులో లక్షల మంది పాల్గొంటారు. ఈ యాత్రలో పాల్గొనే సుధీర్ మక్కర్ బాబా మాత్రం మీడియాను ఎట్రాక్ట్ చేస్తాడు. గత ఏడాది పన్నెండున్నర కేజీల బంగారంతో వచ్చిన గోల్డ్ బాబా.. ఈసారి మరో రెండు కేజీలు పెంచేశాడు.
మరిన్ని వార్తలు