ఆంధ్రప్రదేశ్ లో మే 13న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఎన్నికల ఫలితాలు జూన్ 04న వెలువడనున్న నేపథ్యంలో ఎప్పుడు ఫలితాలు వస్తాయోనని అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ముఖ్యంగా ఈసారి కూటమి అధికారంలోకి వస్తుందా..? లేక మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుందా అని చాలా మంది బెట్టింగ్ లు కూడా వేసుకుంటున్నారు .
ఎక్కువగా సీఎం గా జగన్ అధికారంలోకి వస్తాడని పేర్కొనడం గమనార్హం. మరోవైపు చంద్రబాబు కూడా అధికారంలో రావడం ఖాయమని కొంత మంది బాగా చెబుతున్నారు. తాజాగా ఏపీలో మళ్లీ జగనే గెలుస్తాదని ఇండియా టుడే కూడా పేర్కొంది. ముఖ్యంగా ఐదేళ్లు సంక్షేమ పథకాలు అందుకున్న మహిళలు ఏకపక్షంగా జగనన్నకు మద్దతుగా నిలిచారని మ్యాగజైన్ స్టోరీలో జోస్యం చెప్పింది. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య లుకలుకలు కూటమిని దెబ్బతీస్తే.. జగనన్న చేసిన సిద్ధం నినాదం కోట్లాది మందిని పార్టీకు చేరువ చేసిందని ప్రశంసింది. ఇక అభ్యర్థుల ఎంపికలో జగనన్న చేసిన సోషల్ ఇంజినీరింగ్ దెబ్బకు కూటమి కుదేలైపోయిందని వెల్లడించింది ఇండియా టుడే.