గుడ్ న్యూస్ : కల్కి మూవీ నుంచి ‘బుజ్జి-భైరవ’ల ఫైనల్ ట్రైలర్….!

Good news: Final trailer of 'Bujji-Bhairava' from Kalki movie....!
Good news: Final trailer of 'Bujji-Bhairava' from Kalki movie....!

ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఎడి’ మరికొద్ది రోజుల్లో రిలీజ్‌కు రెడీ అవుతోంది.కల్కి‘బుజ్జి-భైరవ’ల ట్రైలర్.. యానిమేషన్‌లోనూ యాక్షన్ అదుర్స్! కాగా, ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరికొత్త లుక్‌లో కనిపిస్తూ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాడు. ఈ సినిమాలో భైరవ అనే పాత్రలో ప్రభాస్ నటిస్తుండగా, ఆయనకు తోడుగా బుజ్జి అనే  రోబోటిక్ కారు కూడా కనిపిస్తుంది. బుజ్జి, భైరవల మధ్య నడిచే ట్రాక్ సినిమా లవర్స్‌ను కట్టిపడేయనుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

Good news: Final trailer of 'Bujji-Bhairava' from Kalki movie....!

కాగా, ఈ సినిమా రిలీజ్‌కు ముందే యానిమేషన్ సిరీస్‌తో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యింది. యానిమేషన్‌లోనూ యాక్షన్ డోస్ ఏమాత్రం తగ్గకుండా ఈ ట్రైలర్ కట్ ఉండటంతో ప్రేక్షకుల్లో దీనిపై భారీగా అంచనాలు ఏర్పడుతున్నాయి. భైరవ, బుజ్జిల రిలేషన్ నెక్ట్స్ లెవెల్‌లో ఉండనుందని ఈ ట్రైలర్ కట్ చూస్తే అర్ధమవుతోంది.ఈ సినిమాలో హీరోయిన్ అందాల భామ కీర్తి సురేష్. దీంతో ఈ యానిమేషన్ సిరీస్‌ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు మరింత ఆతృతగా చూస్తున్నారు. ఇక ‘కల్కి 2898 ఎడి’ థియేట్రికల్ రిలీజ్‌ను జూన్ 27న భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.