కరోనా వైరస్ మహమ్మారి సమయంలో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందిన పేషెంట్లకు భారీ ఊరట లభించింది. రోగులకు వైద్య చికిత్స ఖర్చులను మాఫీ చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. జనరల్ వార్డుల్లో అడ్మిషన్ ఫీజు, మెడికల్ ఇన్వెస్టిగేషన్ కోసం అయ్యే ఖర్చులను మాఫీ చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద లబ్ధిదారులకు ఈ అవకాశం కల్పించనుంది ప్రభుత్వం.
అదేవిధంగా రిఫరెన్స్ ద్వారా వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయిన వారికి కూడా అడ్మిషన్ ఛార్జీలు ఉండవని తేల్చి చెప్పింది. అయితే సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు ఈ అవకాశం కల్పించనున్నట్లు వివరించింది. ఆయుస్మాన్ భారత్ ప్రకారం ఈ ఆదేశాలు జారీ చేశారు. మార్చి 24వ తేదీ నుంచి తొలిసారి ఎయిమ్స్ దవాఖానా ఓపీడీ సేవలను నిలిపివేసింది. కేవలం ఎమర్జెన్సీ సర్జరీలు మాత్రమే చేయాలని మరో నివేదిక ద్వారా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.