అయ్యప్ప భక్తులకు శుభవార్త…శబరిమలకు మరో 22 ప్రత్యేక రైళ్లు వెళ్లనున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమల వెళ్లే భక్తుల కోసం డిసెంబర్, జనవరిలో 22 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
సికింద్రాబాద్-కొల్లం, సికింద్రాబాద్-కొట్టాయం, కాకినాడ-కొట్టాయంల మధ్య ఈ రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. ఈ నెలలో 4 రైళ్లు 27-30 తేదీల మధ్య, జనవరి 3-15 వరకు మరో 18 రైళ్లు రాకపోకలు కొనసాగిస్తాయి.
అటు శబరిమల అయ్యప్పస్వామి ఆలయం దర్శనం సమయం పెంచుతున్నట్లు ట్రావెన్కోర్ దేవస్థాన బోర్డు తెలిపింది. భక్తుల రద్దీ దృష్ట్యా దర్శనం సమయాన్ని పెంచినట్లు వెల్లడించింది. దర్శనం సమయం మధ్యాహ్నం విడతలో 3 గంటల నుంచి రాత్రి 11 వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. అంటే రోజూ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులు స్వామి వారిని దర్శించుకుంటుండగా తాజాగా మధ్యాహ్నం 3 గంటల నుంచే దర్శనాలు ప్రారంభించడం వల్ల మరో గంట దర్శన సమయం పెరిగినట్లైంది.