కళ్యాణ్ రామ్ సినిమా ట్రైలర్ వచ్చేసింది..!

కళ్యాణ్ రామ్ సినిమా ట్రైలర్ వచ్చేసింది..!
Cinema News

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తూ తన అభిషేక్ పిక్చర్స్ సంస్థ పై గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్న భారీ పాన్ ఇండియన్ సినిమా డెవిల్. ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ సినిమా నుండి ఇటీవల అయిన సాంగ్స్, టీజర్, పోస్టర్స్ అందరినీ ఆకట్టుకోగా తాజాగా ఈవెంట్ లో భాగంగా థియేట్రికల్ ట్రైలర్ ని గ్రాండ్ గా లాంచ్ చేసారు.

కళ్యాణ్ రామ్  సినిమా ట్రైలర్ వచ్చేసింది..!
Kalyan Ram

ముఖ్యంగా ట్రైలర్ లో కళ్యాణ్ రామ్ లుక్స్, స్టైల్, డైలాగ్స్, ఫైట్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్, యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలు ఎంతో ఆకట్టుకున్నాయి అని చెప్పాలి. ఇక డెవిల్ ట్రైలర్ ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటుండడంతో పాటు ఇప్పటివరకు సినిమా పై ఉన్న అంచనాలు అమాంతం పెంచేసింది. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 29న ఆడియన్స్ ముందుకి రానుంది.