కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ సెన్సార్ …..!

కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ సెన్సార్ .....!
Cinema News

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంతో పాటు అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై గ్రాండ్ గా నిర్మిస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లింగ్ పాన్ ఇండియన్ సినిమా డెవిల్. ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనేది దీనికి ఉపశీర్షిక. సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల డెవిల్ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్ని కూడా ఆకట్టుకుని మూవీ పై ఆడియన్స్ లో ఫ్యాన్స్ లో ఎన్నో అంచనాలు ఏర్పరిచాయి.

కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ సెన్సార్ .....!
Kalyan Ram “Devil”

ఇక ఈ మూవీ కి సంబంధించి సెన్సార్ కార్యక్రమాలు నేడు కొద్దిసేపటి క్రితం పూర్తి అయ్యాయని మేకర్స్ ఒక పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు. కాగా ఈ మూవీకి యు / ఏ సర్టిఫికెట్ లభించగా దీని రన్ టైం 2 గం. 26ని. లుగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన డెవిల్ తప్పకుండా డిసెంబర్ 29న రిలీజ్ తరువాత పెద్ద సక్సెస్ సొంతం చేసుకుంటుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.