ఏపీ ప్రజలకు శుభవార్త… 5 లక్షల సామూహిక గృహ ప్రవేశాలు ఫిబ్రవరిలో జరుగనున్నాయి. ఏపీలో గృహ యజ్ఞం మెగా డ్రైవ్ జరుగనుంది. దీంతో ఫిబ్రవరిలో మరో 5 లక్షల సామూహిక గృహ ప్రవేశాలు చేయించనున్నారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు కార్యాచరణ అమలుకు క్షేత్రస్థాయి చర్యలు తీసుకోనున్నారు. జనవరి నెలాఖరుకు 4.18 లక్షల పేదల ఇళ్లను పూర్తి చేసేలా మెగా కంప్లీషన్ డ్రైవ్ జరుగనుంది.
డ్రైవ్ నిర్వహణపై డిసెంబర్ 1 నుంచి జనవరి 31 వరకు కలెక్టర్లకు సీఎస్ దిశా నిర్దేశం చేశారు. సచివాలయాల వారీగా ఇళ్ల నిర్మాణాల పూర్తికి లక్ష్యాలు పెట్టుకున్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వలంటీర్లు వెళ్ళనున్నారు. జియో ట్యాగింగ్ ఫొటోలు ప్రత్యేక యాప్లో అప్లోడ్ చేయనున్నారు. పేదల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అడ్వాన్స్ నిధులివ్వడం ఇదే తొలిసారి అన్నారు. ఆర్థిక వెసులుబాటు కోసం 2.06 లక్షల మంది లబ్ధిదారులకు రూ.378.82 కోట్లు చేకురనుంది.