ఏపీ ప్రజలకు శుభవార్త. ఏపీలోని శ్రీ సిటీలో డైకిన్ ఏసీల తయారీ పరిశ్రమ ప్రారంభం అయింది. దేశంలోనే మూడోదిగా డైకిన్ ఏసీల తయారీ పరిశ్రమ ప్రారంభం అయింది. ఆగ్నేయ ఆసియా ఖండంలో అతిపెద్ద ప్లాంట్ గా విస్తరణ అవుతోంది. ఈ మేరకు శ్రీ సిటీలో డైకిన్ ఏసీల తయారీ పరిశ్రమను ప్రారంభించారు ఆ కంపెనీ ప్రతినిధులు.
శ్రీసిటీ డొమెస్టిక్ టారీఫ్ జోన్ పరిధిలో 75.5 ఎకరాల స్థలంలో రూ.1000 కోట్ల భారీ పెట్టుబడితో నిర్మించిన ఈ ప్లాంట్లో ఏడాదికి 1.5 మిలియన్ ఏసీ యూనిట్లతో పాటు కంప్రెషర్లు, కం ట్రోలర్ బోర్డులు, ఇతర విడిభాగాలను ఉత్పత్తి చేస్తారు. ఈ పరిశ్రమ ద్వారా మూడు వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. దీంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.