ఆంధ్రప్రదేశ్ విద్యుత్తు శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెరిగాయి. ఈ మేరకు రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి కార్యదర్శి విజయానంద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 11 నుంచి ప్రభుత్వం పెంచిన వేతనం అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు 37 శాతం పెంచింది ప్రభుత్వం.విద్యుత్ శాఖలో మొత్తం 27వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. సీఎం జగన్ సూచనలతో విద్యుత్ శాఖ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంచినట్టు తెలిపారు. తాజాగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతం రూ.21వేలు ప్రభుత్వం నిర్ణయంతో దాటింది. అలాగే, ప్రభుత్వం కాంట్రాక్ట్ ఏజెన్సీలకు గ్రూప్ ఇన్యూరెన్స్ సౌకర్యం కల్పించాలని ఆదేశించింది.
రూ.22,589 నుంచి రూ.30, 605కు జీతం హై స్కిల్డ్ ఉద్యోగికి పెరిగింది. 20,598 నుంచి రూ.27,953లకు స్కిల్డ్ ఉద్యోగికి జీతం పెంచారు. సెమీ స్కిల్డ్ ఉద్యోగికిరూ.17,144 నుంచి రూ.23, 236 కు జీతం పెరిగింది. రూ.16,473 నుంచి 22,318 కు జీతం అన్ స్కిల్డ్ ఉద్యోగికి పెంచారు.ఉద్యోగులు జీతాల పెంపుపై ఆనందం వ్యక్తం చేశారు.. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
ఇటీవల విద్యుత్ ఉద్యోగులు తమ సమస్యల్ని పరిష్కరించాలంటూ సమ్మెకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగులతో జరిపిన చర్చలు ఫలించాయి. ఉద్యోగ సంఘాల నేతలు పీఆర్సీపై ఎట్టకేలకు అంగీకారం తెలిపారు. ఒప్పందంపై యాజమాన్యం, ఉద్యోగ సంఘాల సంతకాలు చేశారు. ఆ వెంటనే సమ్మె నోటీసు ఉపసంహరించుకున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఉద్యోగులతో ప్రభుత్వం చర్చలు సఫలం అయ్యాయని.. సమ్మె విరమించడానికి జేఏసీ నేతలు ఒప్పుకున్నట్లు తెలిపారు.మంత్రి 8 శాతం ఫిట్ మెంట్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నామని.. ఉద్యోగులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు . ఏవైనా చిన్నచిన్న సమస్యలుంటే పరిష్కరించుకుంటామని.. జేఏసీ నేతలు అందరూ సంతకాలు చేశారన్నారు.
విద్యుత్ ఉద్యోగ సంఘాల నేత సాయి కృష్ణ ప్రభుత్వ విన్నపం,సంస్థను రక్షించుకోవాలనే ఉద్దేశంతో ఒప్పుకున్నామన్నారు .సంతృప్తిగా లేకపోయినా 8 శాతం ఫిట్ మెంట్ ఒప్పుకున్నామని.. 8 శాతం ఫిట్ మెంట్ సింగిల్ మాస్టర్ స్కెల్ 2.6 లక్షల తో పాటు ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారన్నారు. మొత్తం 12 డిమాండ్లలో 8 డిమాండ్లు పరిష్కారం అయ్యాయన్నారు. సమస్యలున్నా ప్రజలు ఇబ్బంది పడకూడదని నిర్ణయం తీసుకున్నామన్నారు. అలాంటి సంఘాలతో కూడా మాట్లాడి ఒప్పిస్తామన్నారు. అయితే ఇప్పుడు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలను ఏపీ ప్రభుత్వం భారీగా పెంచింది.