కేంద్రం గుడ్ న్యూస్… ఆధార్ కు వేలిముద్ర అవసరం లేదు..

Good news from Kendra... Fingerprint is not required for Aadhaar..
Good news from Kendra... Fingerprint is not required for Aadhaar..

Aadhaar Card: మన దేశంలో ఆధార్ అనేది ఒక ప్రత్యేకమైన గుర్తింపు కార్డు అయితే ఆధార్ కార్డు తప్పనిసరి కాదని ప్రభుత్వం ఎన్ని సార్లు చెప్పినా దాని అవసరం ఏదో ఒక రూపంలో ఉంటుంది. అయితే కొందరి వేలిముద్రలు లేకపోవడంతో ఆధార్ కార్డు పొందడం కష్టంగా మారింది. వేలిముద్ర పడకపోవడంతో ఆధార్ కార్డుకు అర్హులు కాదంటూ వస్తున్న వార్తలకు కేంద్ర చెక్ పెట్టంది. వేలిముద్ర పడకపోయిన ఆధార్ కార్డు పొందవచ్చని కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆధార్ కార్డు పొందాలంటే వేలిముద్రలు తప్పనిసరి. అయితే వేళ్లు లేవని, వేలి ముద్రలు సరిగా పడటం లేదన్న పేరుతో ఆధార్‌ను తిరస్కరించలేరని స్పష్టం చేశారు. వారందరికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఐరిస్ ద్వారా ఆధార్ పొందవచ్చని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. కేరళకు చెందిన జోసిమల్ పి.జోస్ అనే మహిళ తనకు వేళ్లు లేకపోవడంతో ఆధార్‌లో పేరు నమోదు చేసుకోలేకపోతున్నామని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్ర శేఖర్ కు విజ్ఙప్తి చేశాడు. దీంతో స్పందించిన కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్ ఐరిస్ ద్వారా ఆధార్ పొందవచ్చని స్పష్టం చేశారు. దీంతో కొందరు వేలుముద్ర పడకపోవడంతో ఆధార్ లేనివారు ఇది శుభవార్త అనే చెప్పాలి.

కేరళలోని కొట్టాయం జిల్లా కుమరకోమ్ పట్టణంలో వేళ్లు లేని జోసిమోల్ పి.జోస్ అనే మహిళ తన ఇంట్లో ఆధార్ నమోదు చేసుకున్న విషయాన్ని శనివారం కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ గుర్తు చేసుకున్నారు. ఆమె విషయంలో మంత్రి జోక్యం చేసుకుని ఆధార్‌ను అందించారు. వేలిముద్రలు ఇవ్వలేని వారు వేలిముద్రల ద్వారా, ఐరిస్ సరిగా లేనివారు ఐరిస్ స్కాన్ ద్వారా ఆధార్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఎవరికైనా వేలిముద్రలు, ఐరిస్‌ రెండూ లేకుంటే అవి లేకుండానే ఆధార్ కోసం తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని వెల్లడించారు. అటువంటి వ్యక్తులు బయోమెట్రిక్ మినహాయింపు నమోదు మార్గదర్శకాల క్రింద పేరు, లింగం, చిరునామా, పుట్టిన తేదీ వివరాలను సమర్పించాలన్నారు. ఆ వివరాలతో కూడిన బయోమెట్రిక్ ఇస్తే సరిపోతుందని చెప్పారు. తమ వద్ద లేని వస్తువుల వివరాలను ఎన్‌రోల్‌మెంట్ సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేయాలన్నారు. మార్గదర్శకాలకు అనుగుణంగా ఫోటో తీయాలని సూచించారు. ఈ నిబంధనలను పాటించిన తర్వాత ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్ సూపర్‌వైజర్ ధ్రువీకరిస్తే సరిపోతుందన్నారు.