గుడ్ న్యూస్ : పవన్ బర్త్ డే కు“గబ్బర్ సింగ్”రీ రిలీజ్!

Good news: "Gabbar Singh" re-release for Pawan's birthday!
Good news: "Gabbar Singh" re-release for Pawan's birthday!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ పూర్తి చేయాల్సిన మూవీ లు ఇంకా ఉన్నాయి. షూటింగ్ బ్యాలెన్స్ కారణం గా ఎలాంటి అప్డేట్స్ లు కూడా లేవు. అయితే పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు అయిన సెప్టెంబర్ 2 వ తేదీన ఫ్యాన్స్ కు మంచి ట్రీట్ ఉండనుంది.

Good news: "Gabbar Singh" re-release for Pawan's birthday!
Good news: “Gabbar Singh” re-release for Pawan’s birthday!

పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ సినిమా అయిన గబ్బర్ సింగ్ మూవీ ఇండస్ట్రీ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా రీ రిలీజ్ కానున్నది . శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ లో అభిమన్యు సింగ్, రావు రమేష్, సుహాసిని, బ్రహ్మానందం, ప్రభాస్ శ్రీను లు కీలక పాత్రల్లో నటించారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీ రీ రిలీజ్ కి ఎలాంటి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.