గుడ్ న్యూస్: సంబరాల్లో నారా,నందమూరి ఫ్యామిలీ…!

Good news: Nara, Nandamuri family in celebration...!
Good news: Nara, Nandamuri family in celebration...!

ఏపీలో కూటమి విజయదుందుభి సాగిస్తుంది . బీజేపీ, టీడీపీ , జనసేన కూటమి ఘన విజయంతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నివాసంలో ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. నారా, నందమూరి కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి ఈ వేడుకల ల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు కూడా తెలుపుకున్నారు.

Good news: Nara, Nandamuri family in celebration...!
Good news: Nara, Nandamuri family in celebration…!

చంద్రబాబు మనవడు దేవాన్ష్ కేక్ కట్ చేసి తాతకి , బంధువులకి కేక్ తినిపించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో చంద్రబాబు చాలా ఉత్సాహంగా కనిపించారు. సంబరాల్లో భాగంగా చంద్రబాబు నాయడు కుటుంబంతో పాటుగా నందమూరి బాలకృష్ణ ఫ్యామిలి కూడా ఒక్కరినొక్కరు ఆలింగనం చేసుకుంటూ ఆనందంగా కనిపించారు. లోకేశ్ సైతం ఉత్సాహంగా ఉన్నారు . కేక్ కట్ చేసిన అనంతరం నారా భువనేశ్వరితో పాటుగా చంద్రబాబుకి లోకేశ్ కేక్ తినిపించారు. ఇక చంద్రబాబు ఇంటి ముందు తెలుగుదేశం,పార్టీ అభిమానులు బారులు తీరారు. చంద్రబాబు నాయుడి ఇంటి పరిసరాలు మొత్తం జై బాబు, సీఎం అంటూ నినాదాలతో
హోరెత్తిస్తున్నారు .