ఐఫోన్‌ ప్రియులకు శుభవార్త

ఐఫోన్‌ ప్రియులకు శుభవార్త

ఐఫోన్‌ ప్రియులకు యాపిల్‌ శుభవార్త చెప్పింది. తాజాగా ఐఫోన్‌ 13 సిరీస్‌ మోడళ్లను లాంచ్‌ చేసిన సందర్భంగా కొన్ని మోడళ్ల ధరలను తగ్గించినట్లు యాపిల్‌ ప్రకటించింది. కొత్త సిరీస్‌ లాంచ్‌ తరువాత పాత మోడళ్లైన యాపిల్ ఐఫోన్‌ 11, ఐఫోన్‌ 12 ఫోన్‌ ధరల్ని తగ్గించడం ఆసక్తికరంగా మారింది.

కాగా యాపిల్‌ ‘కాలిఫోర్నియా స్ట్రీమింగ్‌’ వర్చువల్‌ ఈవెంట్‌లో ఐఫోన్‌ 13 సిరీస్‌, యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 7, 10.2 అంగుళాల ఐపాడ్‌, ఐపాడ్‌ మినీలను యాపిల్‌ సీఈఓ టీమ్‌ కుక్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే.