చౌక ధరలోనే అధిక డేటా ప్లాన్స్

చౌక ధరలోనే అధిక డేటా ప్లాన్స్

దేశంలోని దిగ్గజ ఫైబర్ బ్రాడ్‌బాండ్ సర్వీస్ ప్రొవైడర్లలో రిలయన్స్ జియో ఫైబర్ కూడా ఒకటి. తక్కువ కాలంలోనే జియో ఫైబర్ పలు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను వెనక్కి నెట్టేసింది. చౌక ధరలోనే అధిక డేటా ప్లాన్స్ ఆవిష్కరిస్తూ.. జియో మార్కెట్‌ వాటా కొల్లగొడుతూ వస్తోంది.

జియో ఫైబర్ అందిస్తున్న ప్లాన్లలో బెస్ట్ ప్లాన్ ఒకటుంది. ఇది డేటా సాచెట్ ప్లాన్. దీని ద్వారా కేవలం రూ.199కే ఏకంగా 1000 జీబీ డేటా పొందొచ్చు. అయితే ఈ ప్లాన్ వాలిడిటీ మాత్రం కేవలం 7 రోజులే. అంతేకాకుండా అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. జియో ఫైబర్ ల్యాండ్ లైన్ సర్వీస్ ద్వారా కాల్స్ మాట్లాడుకోవాలి.

జీఎస్‌టీ కలుపుకుంటే ఈ ప్లాన్ ధర రూ.235 అవుతుంది. ఈ ప్లాన్ కలిగిన వారు 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో డేటా పొందొచ్చు. వారం రోజుల వాలిడిటీ ముగిసిన తర్వాత డేటా స్పీడ్ 1 ఎంబీపీఎస్‌కు తగ్గిపోతుంది. కస్టమర్లు వారి ప్లాన్‌లో డేటా అయిపోయిన తర్వాత ఈ డేటా సాచెట్ ప్లాన్ రీచార్జ్ చేసుకోవచ్చు.

జియో సాధారణంగా తన ప్లాన్లపై 3.3 టీబీ డేటా అందిస్తోంది. సాధారణ కస్టమర్లకు ఈ డేటా చాలా ఎక్కువ. దీన్ని మించి మళ్లీ రీచార్జ్ చేసుకునే వారు ఎక్కువగా ఉండరు. ఏదైమైనా జియో మాత్రం తక్కువ ధరలో మంచి ప్లాన్ అందుబాటులో ఉంచింది. ఎఫ్‌యూపీ డేటా అయిపోయిన తర్వాత డేటా సాచెట్ ప్లాన్ ఎంచుకోవచ్చు.