వాహనదారులకు తీపికబురు

వాహనదారులకు తీపికబురు

కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు తీపికబురు అందించింది. కీలక నిర్ణయం తీసుకుంది. వాలిడిటీ అయిపోయిన మోటార్ వెహికల్ డాక్యుమెంట్ల గడువు పొడిగించింది. కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది.

వాలిడిటీ ముగిసిన డాక్యుమెంట్లు కలిగిన వారికి మరో నెల రోజుల పాటు గడువు లభించింది. డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఇతర పర్మిట్లకు సంబంధించి గడువు అయిపోయి ఉంటే.. వాహనదారులు అక్టోబర్ 31లోపు వాటిని రెన్యూవల్ చేసుకోవచ్చు.

మోదీ సర్కార్ కోవిడ్ 19 ప్రతికూల పరిస్థితుల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. గడువు అయిపోయిన డాక్యుమెంట్లను కూడా పరిగణలోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సంబంధిత అధికారులను ఆదేశించింది. వాలీడ్ డాక్యుమెంట్లుగానే పరిగణలోకి తీసుకోవాలని తెలిపింది.

2020 ఫిబ్రవరి 1 నుంచి వాలిడిటీ అయిపోయిన డాక్యుమెంట్లకు మాత్రమే ఇది వర్తిస్తుందని గమనించాలి. కోవిడ్ 19 ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో మోదీ సర్కార్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే వాహనదారులు వాలిడిటీ అయిపోయిన డాక్యుమెంట్లను ఆలస్యం చేయకుండా రెన్యూవల్ చేసుకోవడం ఉత్తమం.