గుడ్ న్యూస్ : ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చేసిన “తుఫాన్”…!

Good news: "Tufaan" is streaming on OTT...!
Good news: "Tufaan" is streaming on OTT...!

తమిళ ప్రముఖ నటుడు అలాగే సంగీత దర్శకుడు కూడా అయినటువంటి విజయ్ ఆంటోనీ ఇప్పుడు హీరోగానే పలు మూవీ లు చేస్తున్న సంగతి తెలిసిందే. అలా ఈ ఏడాదిలో తాను నటించిన రెండు మూవీ లు వచ్చాయి. మరి వాటిలో లేటెస్ట్ మూవీ నే “తూఫాన్”. దర్శకుడు విజయ్ మిల్టన్ తెరకెక్కించిన ఈ మూవీ లో మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటించింది. అయితే ఈ మూవీ థియేటర్స్ లోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే ఓటిటిలో కి వచ్చేసింది.

తమిళ్ లో గత వారమే అందుబాటులోకి వచ్చిన ఈ మూవీ ఇప్పుడు తెలుగులో కూడా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఈ మూవీ హక్కులు ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకోగా ఇప్పుడు ఇందులోనే తెలుగులో కూడా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. మరి విజయ్ ఆంటోనీ మూవీ లు చూడాలి అనుకునేవారు అయితే ఈ మూవీ ని ఇందులో చూడొచ్చు. ఇక ఈ మూవీ కి అచ్చు, విజయ్ ఆంటోనీలు సంగీతం అందించగా ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్ వారు నిర్మాణం వహించారు.