NDA కూటమికి అన్నాడీఎంకె గుడ్ బై..

Goodbye AIADMK to NDA alliance..
Goodbye AIADMK to NDA alliance..

ఎన్‌డీఏ కూటమికి అన్నాడీఎంకె గుడ్ బై చెప్పింది. సోమవారం జరిగిన ఏఐఏడీఎంకే కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు ఏకగీవ్రంగా తీర్మానం చేశారు. గత కొంతకాలంగా రాష్ట్రంలో బీజేపీ నేతలు అన్నాడిఎంకె నేతలపై విమర్శలు చేస్తున్నారని ఆ పార్టీ ఆరోపిస్తుంది. ఎన్‌డీఏ కూటమి నుంచి బయటకి రావడానికి బీజేపీ నేతల వైఖరే కారణమని ఎఐఏడీఎంకే నేతలు ప్రకటించారు.బీజేపీతో పొత్తుపై చర్చించేందుకు ఎఐఏడీఎంకె ప్రధాన కార్యదర్శి కె. పళనిస్వామి అధ్యక్షతన ఆయా జిల్లాల్లోని పార్టీ కార్యదర్శులు, ఎమ్మెల్యేలు,ఇతర కీలక నేతలతో సోమవారం ఆ పార్టీ సమావేశం జరిగింది

అన్నాడీఎంకెపై బీజేపీ తమిళనాడు రాష్ట్ర శాఖ ఉద్దేశ్యపూర్వకంగా విమర్శలు చేయడాన్ని అన్నాడీఎంకే సమావేశం తప్పుబట్టింది. అన్నాడీఎంకె సమావేశంలో బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసిన తర్వాత ఆ పార్టీ కార్యాలయం వెలుపల కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు . బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై అన్నాడీఎంకే నేతలు మండిపడ్డారు. ఈ విషయమై బీజేపీ కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆ పార్టీ ఆరోపించింది. బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై క్షమాపణలు చెప్పాలని కోరుతూ ఆ పార్టీ నేతలు శుక్రవారంనాడు పీయూష్ గోయల్, జేపీ నడ్డాని కలిశారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాల గురించి వివరించారు.