భారత్‌తో కలిసి పని చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాము: చైనా రాయబారి

We are ready to work with India: Chinese Ambassador
We are ready to work with India: Chinese Ambassador

చైనా టైం దొరికిన ప్రతిసారి భారత్‌పై కవ్వింపు చర్యలకు పాల్పడే ఇప్పుడు కొత్త రాగం పాడుతోంది. భారత్‌తో కలిసి పని చేయాలని తమకు ఆసక్తిగా ఉందంటూ చైనా రాయబారి ఒకరు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పటికే ఇరు దేశాల మధ్య దౌత్యపరంగా టెన్షన్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా ఆసియా క్రీడల్లో భాగంగా కొందరు భారత ఆటగాళ్లకు చైనా వీసాలతోపాటు అక్రిడిటేషన్‌ నిరాకరించడంపై ఇరు దేశాల మధ్య మరోసారి వివాదం మొదలైంది. ఉద్దేశపూర్వకంగానే చైనా ఈ చర్యలకు పాల్పడిందని భారత్ ఆరోపించింది.

కోల్‌కతాలోని చైనా రాయబారి ఝా లియూ ఈ నేపథ్యంలో ఇరు దేశాల సంబంధాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చైనా భారత్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం భారత్‌-చైనాల మధ్య సంబంధాలు స్థిరంగా ఉన్నాయని అన్నారు. ‘ముఖ్యమైన అంశాలపై ఇరు దేశాల నాయకులు చర్చించి ఏకాభిప్రాయాన్ని అమలు చేసేందుకు తమ దేశం సుముఖంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. చైనా ప్రపంచ అభివృద్ధి, శాంతి కోసం భారత్‌ సహా పొరుగు దేశాలతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉందని ఝూ లియూ తెలిపారు.