“సికమోర్‌ చిప్‌”తో గూగుల్ అరుదైన ఘనత

"సికమోర్‌ చిప్‌"తో గూగుల్ అరుదైన ఘనత

గొప్ప వేగం మరియు మెమొరీ కలిగిన కంప్యూటర్ సూపర్‌ కంప్యూటర్. సాదారణ కంప్యూటర్ కన్నా వేల రెట్ల వేగంతో పనిచేస్తుంది. సూపర్‌ కంప్యూటర్లను కన్నా వేగంతో పని చేసే “సికమోర్‌ చిప్‌”ను గూగుల్‌ సంస్థ అభివృద్ధి చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. దీనితో క్యాంటమ్‌ కంప్యూటింగ్‌ రంగంలో గూగుల్‌ ఎనలేని ఘనత సాదించింది. సూపర్‌ కంప్యూటర్‌ 10 వేల ఏళ్లలో పూర్తి చేసే గణనను ఈ చిప్‌ కేవలం 200 సెకన్లలో పూర్తి చేస్తున్నట్లు గూగుల్‌ సంస్థ ప్రకటించింది.

అంకగణిత పనులను చాలావేగంగా చేస్తుంది కాబట్టి సూపర్‌ కంప్యూటర్ని వాతావరణ అంచనా, కోడ్ బ్రేకింగ్ జన్యు విశ్లేషణలో ఉపయోగిస్తున్నారు. దీని కన్నావేగంగా పని చేసే సికమోర్‌ చిప్ ని క్యాంటమ్‌ సుప్రిమసీ వర్ణిస్తూ 54 క్యూబిట్స్‌ తో కూడిన క్యాంటమ్‌ ప్రాసెసర్‌ వల్ల పనిచేస్తుందని గూగుల్ సంస్థ వెల్లడించింది.

గూగుల్‌ కృతిమ మేధ-ఏఐ శాస్త్రవేత్త జాన్‌ మార్టిన్స్‌ మాట్లాడుతూ బైనరీ సంఖ్యల ఆధారంగా సాధారణ కంప్యూటర్లు డేటా ప్రక్రియలను నిర్వహించగ బైనరీ సంఖ్యలతో పాటు 54 క్యూబిట్స్‌ తో కూడిన క్యాంటమ్‌ ప్రాసెసర్‌ తో సికమోర్‌ చిప్‌ పని చేయనున్నట్టు, దీని వల్ల గణన ప్రక్రియ అత్యంత వేగంగా ఉంటుందని తలిపారు.