బ్యాడ్‌టైం.. గోపీచంద్‌లో టెన్షన్‌

gopichand tension Start for pantham movie

ప్రస్తుతం టాలీవుడ్‌కు బ్యాడ్‌ టైం నడుస్తుందా అనే అనుమానం వ్యక్తం అవుతుంది. గత నెల రోజులుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఏ ఒక్క సినిమా కూడా ఆకట్టుకోలేక పోయింది. ముఖ్యంగా నిన్న విడుదలైన 8 చిత్రాల్లో 8 చిత్రాలు కూడా బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. అందరి దృష్టిని ఆకర్షించిన ‘ఈ నగరానిరి ఏమైంది’ మరియు ‘శంభో శంకర’ చిత్రాలు అడ్డంగా అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యాయి. ఈ రెండు మినిమం సక్సెస్‌ అవ్వడం ఖాయం అని అంతా భావించారు. కాని ఆ చిత్రాలే దారుణంగా నిరాశ పర్చాయి. గత మూడు నాలుగు వారాలుగా విడుదలవుతున్న చిత్రాల్లో ఏ ఒక్కటి సక్సెస్‌ను దక్కించుకోలేక పోయిన కారణంగా వచ్చే వారం రాబోతున్న చిత్రాల్లో టెన్షన్‌ వాతావరణ కనిపిస్తుంది.

వచ్చే వారం రాబోతున్న చిత్రాల్లో ప్రముఖ చిత్రం ‘పంతం’. గోపీచంద్‌ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంపై పెద్దగా అంచనాలు లేవు. గోపీచంద్‌ గత చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద ఫ్లాప్‌గా నిలిచాయి. దాంతో ఈ చిత్రం కూడా పెద్దగా ఆకట్టుకోక పోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అందుకే ఈ చిత్రంను కొనుగోలు చేసేందుకు డిస్ట్రిబ్యూటర్లు కూడా పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అయితే చిత్ర యూనిట్‌ సభ్యులు మాత్రం సినిమా విడుదలైన తర్వాత సక్సెస్‌ టాక్‌తో దూసుకు పోతుందని పైకి మేకపోతు గాంభీర్యంను చూపుతున్నారు. అయితే అంతర్గతంగా మాత్రం టెన్షన్‌తో ఉన్నట్లుగా అనిపిస్తుంది. గోపీచంద్‌ ఈ చిత్రం కూడా ఫ్లాప్‌ అయితే ఆయన కెరీర్‌ మరింత కష్టాల్లో చిక్కుకున్నట్లే అంటూ సినీ వర్గాల వారు మరియు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.