ఏపీ అసెంబ్లీలో ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తున్న గవర్నర్

governer speech in ap assembly

మూడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభల్ని ఉద్దేశించి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తున్నారు. కొత్త ప్రభుత్వానికి ఈ సందర్భంగా గవర్నర్ అభినందనలు తెలిపారు. మేనిఫెస్టో అమలు ప్రణాళికను గవర్నర్ ప్రసంగంలో వైసీపీ ప్రభుత్వం చేర్చింది.కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలపారు.పోలవరం ప్రాజెక్టును త్వరంలో పూర్తి చేస్తామన్నారు. పాలనలో సంస్కరణలో తీసుకొస్తామన్నారు గవర్నర్ నరసింహన్. కొత్త విధానాలు అవలంబించి సుపరిపాలన అందిస్తామన్నారు. ఆయన ప్రసంగంలో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, హామీల అమలు గురించి వివరించనున్నారు. ఇందు కోసం గవర్నర్‌ నరసింహన్‌ గురువారం సాయంత్రమే హైదరాబాద్ నుంచి విజయవాడకు చేరుకున్నారు. వైసీపీ మేనిఫెస్టోలోని నవరత్నాలు అమలుతోనే ప్రభుత్వం వేస్తున్న తొలి అడుగుల గురించి, అవినీతి రహిత పారదర్శక పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యంగా గవర్నర్‌ తర ప్రసంగం ద్వారా స్పష్టం చేయనున్నారు. గత ప్రభుత్వ వైఫల్యాలను కూడా గవర్నర్‌ ప్రసంగంలో స్పష్టం చేయనున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. మొత్తం మీద ప్రభుత్వ విధానాలు, లక్ష్యాలను గవర్నర్‌ తన ప్రసంగం ద్వారా వివరించనున్నారు. ఉభయ సభలనుద్ధేశించి గవర్నర్‌ ప్రసంగం పూర్తయ్యాక సభ వాయిదా పడుతుంది. శనివారం, ఆదివారం సభకు సెలవు కావడంతో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సోమ, మంగళవారాల్లో చర్చ జరుగుతుంది. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమాధానం ఉంటుంది.