ప్రభుత్వ టెలికం సంస్థల విలీనం

ప్రభుత్వ టెలికం సంస్థల విలీనం

ప్రభుత్వ రంగ టెలికం సంస్థలు బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్‌ భారీనష్టాలతో ఉన్నాయి. పునరుద్ధరణ కొరకి బుధవారం సమావేశమైన కేంద్రక్యాబినెట్‌ 68,751కోట్ల రూపాయాలని కేటాయింపుకు నిర్ణయం తీసుకుంది. 4జీ స్పెక్ట్రం కేటాయింపుతో పాటు స్వచ్ఛంద పదవీ విరమణ పథకం కూడా ఈ ప్యాకేజీలో ఉన్నాయి.

టెలికం శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ ఎంటీఎన్‌ఎల్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌ విలీనం అయ్యేవరకి ఎంటీఎన్‌ఎల్‌ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌కు అనుబంధ సంస్థగా ఉంటుందని తెలిపారు. రెండు సంస్థల తక్షణ మూలధన అవసరాల కోసం 15,000కోట్లు ప్యాకేజీ ప్రకారం ఇచ్చి,20,140కోట్ల విలువ చేసే 4జీ స్పెక్ట్రంను, దానిపై జీఎస్‌టీ కోసం 3,674 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇవ్వనుంది. 4జీ సేవలు అందించేందుకు స్పెక్ట్రం కేటాయించాలంటూ ఈసంస్థలు కేంద్రాన్నికోరగా.. బీఎస్‌ఎన్‌ఎల్‌కు 10,000 కోట్లు, ఎంటీఎన్‌ఎల్‌కు 1,100 కోట్లు అవసారం ఉందని టెలికం కార్యదర్శి అన్షు ప్రకాష్‌ చెప్పారు. రెండు సంస్థలకు ఉన్న 37,500 కోట్ల అసెట్స్‌ ను మూడేళ్ల వ్యవధిలో ప్రభుత్వం విక్రయించడం లేదా లీజుకివ్వం చేయనున్నట్లు అన్షు ప్రకాష్‌ తెలిపారు.