మీ పేరు మీద ఎన్ని సిమ్ లు ఉన్నాయో, ఇలా తెలుసుకోండి.

how many sim card activate my aadhar card

ఈ రోజుల్లో ఒక్కొక్కరి పేరు మీదా కనీసం 2 సిమ్ కార్డ్స్ ఖచ్చితంగా ఉంటున్నాయి. మనం మన పేరు మీద మనకు, మన ఫ్యామిలీ వాళ్లకి సిమ్స్ తీసుకుంటూ ఉంటాం. మనం మన పేరు మీద ఎన్ని సిమ్స్ తీసుకున్నామో మనకి గుర్తుకు ఉండదు. అలాగే మనం ఇచ్చే ఐడీ ప్రూఫ్ లు చట్ట వ్యతిరేక పనులకి కూడా వాడుతున్నారు అని వార్తలు వస్తున్న సమయంలో మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో ఎలా తెలుసుకోవాలి అనే విషయాన్ని ఎలా తెలుసుకోవచ్చో ఇపుడు మీరు తెలుసుకోవచ్చు

Airtel :
ఎయిర్‌టెల్‌ వినియోగదారుడు తమ ఫోన్‌ నుంచి ADCHK స్పేస్‌ ఆధార్‌కార్డు నెంబర్‌ టైప్‌ చేసి 121కి మెసేజ్‌ చేస్తే… ఆధార్‌ కార్డుతో లింక్‌ అయిన నెంబర్ల జాబితా వస్తుంది.

JIO :
జియో వినియోగదారుడు మై జియో యాప్‌, మై అకౌంట్‌లో లింక్ న్యూ అకౌంట్‌ ( Link New Account ) లో చెక్ చేసుకోవచ్చు.

BSNL :
బీఎస్‌ఎన్‌ఎల్‌ కస్టమర్లు ALIST స్పేస్‌ ఆధార్‌ నెంబర్‌ టైప్‌ చేసి 53734 అనే నెంబర్‌కు మెసేజ్‌ చేస్తే మీ ఆధార్‌ కార్డుతో లింక్‌ అయిన నంబర్లు వస్తాయి.

అయితే ఐడియా, వొడాఫోన్‌, డొకోమో, టెలీనార్‌, రిలయన్స్‌ మాత్రం ప్రస్తుతానికి ఈ సర్వీసులను అందించడం లేదు..