ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. ఎన్నికలు దగ్గరకు వచ్చిన తరుణాన నిరుద్యోగ యువత వోట్లే లక్ష్యంగా ఏపీ నిరుద్యోగ బ్రుతి పధకం ప్రకటించిన బాబు సర్కార్ ఇప్పుడు వివిధ శాఖల్లో 20వేలకు పైగా పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, డీఎస్సీ, పోలీస్ శాఖలతో సహా వివిధ శాఖల్లోని 20,010 ఖాళీల భర్తీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని విశ్వసనీయవర్గాల సమాచారం. ఏపీపీఎస్సీ, డీఎస్సీ ద్వారా ప్రత్యక్ష పద్ధతిలో ఖాళీల నియామకం జరుగనుంది.
ఇక ప్రభుత్వం భర్తీ చేయబోతున్న ఉద్యోగాల వివరాలు ఇలా ఉన్నాయి.
నియామకాల వివరాలు :
గ్రూప్-1 : 150 ఖాళీలు
గ్రూప్-2 : 250 ఖాళీలు
గ్రూప్-3 : 1,670 ఖాళీలు
డీఎస్సీ ద్వారా : 9,275 ఖాళీలు
పోలీస్ ఎగ్జిక్యూటివ్, ఏపీఎస్ఎల్‌పీఆర్‌బీ : 3,000 ఖాళీలు
వైద్య శాఖల్లో : 1,604 ఖాళీలు
ఇతర శాఖల్లో : 1,636 ఖాళీలు