మరో సారి స్వామి భక్తి నిరూపించుకున్న గవర్నర్…కాంగ్రెస్ కి భారీ షాక్

governor shocks congress by appointing bjp mla as pro tem speaker

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

 

కర్ణాటకలో ఇప్పుడు అందరి దృష్టి యడ్యూరప్ప బలపరీక్ష పైనే ఉంది. మరో 24 గంటల్లో బాల నిరూఅన చేయాల్సి ఉండడంతో ఎలా అయినా అందుకు తగిన మెజారిటీ సాదించేందుకు బీజేపీ తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు జేడీఎస్-కాంగ్రెస్ లు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే అనుకోని పరిస్థితుల్లో మైనార్టీ ప్రభుత్వాన్ని ఫిరాయింపులతో గట్టెక్కించాలనుకున్న సందర్భాల్లో స్పీకర్ పాత్ర అత్యంత కీలకం. ఎందుకంటే ఆ సమయంలో స్పీకర్ తీసుకునే నిర్ణయం ఫైనల్. కోర్టుల్లో సవాల్ చేసే అవకాశాలు దాదాపుగా లేవనే చెప్పాలి. అందుకే అధికార పార్టీలు చిటికే వేసినంత ఈజీగా సులువుగా పాస్ అయిపోతూంటాయి. కర్ణాటకలో యడ్యూరప్పకు..ఈ అదృష్టం కూడా లేదని కొత్త అసెంబ్లీ ఏర్పడినప్పుడు సభలో అత్యంత సీనియర్ ఎమ్మెల్యే ప్రొటెం స్పీకర్ గా వ్యవహరిస్తారని. ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆర్వీ దేశ్ పాండే అనే సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేను.. అసెంబ్లీ సెక్రటేరియట్ ప్రొటెం స్పీకర్ గా సిఫార్సు చేసింది.

సంప్రదాయం ప్రకారం అర్వీ దేశ్ పాండేకే అవకాశం ఇవ్వాలి. అంటే బలపరీక్ష సమయంలో కోరుకున్నా కోరుకోకపోయినా కాంగ్రెస్ ఎమ్మెల్యేనే స్పీకర్ గా ఉంటారని వార్తలు వచ్చాయి. అయితే తన స్వామి భక్తి కోసం ఏమయినా చేయడానికి సిద్దపడిన వజూభాయ్ మాత్రం నిబంధనలు తుంగలోకి తొక్కి కర్ణాటక అసెంబ్లీ ప్రొటెమ్ స్పీకర్ గా బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే కేజే బోపయ్యను ఎంపిక చేశారు. అంతకుముందు, న్యాయ నిపుణులతో కర్ణాటక గవర్నర్ వాజూభాయ్ చర్చించారు. ప్రొటెం స్పీకర్ గా బోపయ్యను నియమిస్తూ గవర్నర్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. కాసేపట్లో ప్రొటెం స్పీకర్ గా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా, అసెంబ్లీ స్పీకర్ గా బోపయ్య గతంలో పనిచేశారు. ఇప్పుడు విరాజ్ పేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. ఇదిలా ఉండగా, ప్రొటెం స్పీకర్ గా బోపయ్యను నియమించడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది. ఇప్పటివరకు దేశ్ పాండే 8 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు అలాంటి ఎక్కువ సీనియార్టీ ఉన్న తమ ఎమ్మెల్యే దేశ్ పాండేను నియమించకుండా బోపయ్యను ఎలా నియమిస్తారని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. రాజు తలుచుకుంటే దెబ్బలు కొదవా మరి.