గాజువాక ఎమ్మెల్యేగా, విశాఖ ఎంపీగా పోటీ చేస్తానని ప్రజాశాంతి పార్టీ నేత కేఏ పాల్ ప్రకటించారు. ఇవాళ విశాఖలో నామినేషన్లు వేయనున్నట్లు కేఏ పాల్ తెలిపారు. కోడి కత్తి డ్రామా లాంటిదే గులక రాళ్ల దాడులు అని.. అధికార, ప్రతి పక్షాలు నాటకాలు ఆడుతున్నాయని కేఏ పాల్ మండిపడ్డారు. ప్రజాశాంతి పార్టీ పాటను కేపాల్ విడుదల చేశారు. తనకు ఈ పాటను బహుమతిగా పంపానని… మరికొందరు తనకు పాటలు కూడా పంపారని పాల్ తెలిపారు.