మనవరాలి మీద కన్నేసి రేప్ చేసి చంపిన తాత

grandfather raped and killed his grandchildren

కాటికి కళ్ళు చాపిన 72 ఏళ్ల వయసులో కృష్ణా రామా అనుకోకుండా దుర్మార్గుడిలా మారాడో వ్యక్తి. ఆ వయసులో కామంతో కళ్లుమూసుకుపోయి సొంత మనవరాలిపైనే కన్నేసి ఇంట్లో ఎవరూలేని సమయంలో ఆమెపై అత్యాచారం చేయబోయాడు. 16 ఏళ్ల ఆ బాలిక ప్రతిఘటించడంతో తలపై బలంగా కొట్టాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన మనరాలిపై అత్యాచారం చేశాడు. బాలిక మరణించడంతో ఆత్మహత్యగా నమ్మించడానికి ప్రయత్నించి చివరికి పోలీసులకు దొరికిపోయాడు. ఈ దారుణ ఘటన శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా దగదర్తి మండలం సున్నపుబట్టీ గ్రామంలో గత నెల 30న చోటుచేసుకోగా నిందితుడ్ని నిన్న అరెస్టు చేశారు. పోలీసులు వివరాల ప్రకారం సున్నపుబట్టీ గ్రామం పాతూరు గిరిజన కాలనీలో ఉప్పు వెంకటేశ్వర్లు కుటుంబం నివాసం ఉంటోంది. వేంకటేశ్వర్లు తన భార్య రమణమ్మతో ఒక ఇంట్లో నివసిస్తుండగా అతని కుమార్తె మంగమ్మ భర్త, కూతురితో మరో ఇంట్లో ఉంటోంది. మంగమ్మకు ఒక కుమార్తె ఉండగా అంగమ్మ భర్త పోలయ్య నెల్లూరులో ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. రెండు రోజులకు ఒకసారి ఇంటికి వచ్చి వెళ్తుంటాడు. అలాగే, వెంకటేశ్వర్లు నెల్లూరులోని ఓ లాడ్జిలో పని చేస్తున్నాడు. అతడి కన్ను తన మనవరాలిపై పడింది. గత నెల 30న పోలయ్య తన భార్యకు ఫోన్‌చేసి కుమార్తెకు పెళ్లిచేద్దామని చెప్పాడు. కుమార్తె మైనరు అయినందున భార్య మంగమ్మ అడ్డుచెప్పింది. వారిమధ్య వాగ్వాదం జరగడంతో మంగమ్మ అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమెను వెదుకుతూ ఆమె తల్లి రమణమ్మ వెళ్లింది. ఇంట్లో మనవరాలు ఒంటరిగా ఉంది. ఇదే అదనుగా భావించిన తాత వెంకటేశ్వర్లు కుమార్తె ఇంట్లోకి వెళ్లి మనవరాలిపై అత్యాచారానికి ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో తలపై బలంగా కొట్టాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాలికను రేప్ చేశాడు. దీంతో బాలిక చనిపోయింది. వెంకటేశ్వర్లు ఎవరికీ అనుమానం రాకుండా ఆమె ఉరి వేసుకున్నట్లు చిత్రీకరించాడు. తల్లిదండ్రులు తన పెళ్లి విషయంలో గొడవపడ్డారనే మనస్తాపంతో ఆమె ఉరి వేసుకున్నట్లు నమ్మబలికాడు. అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి చెందినట్లు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వెంకటేశ్వర్లు చెప్పినట్లు ఉరి వేసుకుంటే బాలిక మెడపై గుర్తులుండాలి. కానీ లేవు. పైగా మృతురాలి తాత, అమ్మమ్మలు పొంతన లేని సమాధానాలు చెప్పారు. దీంతో పోలీసులకు అనుమానం వచ్చి  లోతుగా దర్యాప్తు చేపట్టారు.బాలిక మరణించిన గదిలో పోలీసులకు ఒక కత్తి దొరికింది. ఈ కత్తి ఎక్కడిదని పోలీసులు ఆరా తీశారు. అది తన కుమార్తెదేనని వెంకటేశ్వర్లు చెప్పాడు. కానీ, బాలిక తల్లి మంగమ్మ మాత్రం అది తన తండ్రి వాడతాడని, ఆయన ఇంట్లోనే అది ఉంటుందని చెప్పింది. దీంతో పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు కథ బయటపడింది.