పర్యావరణ పరిరక్షణకోసం కొన్నేళ్లుగా పోరాటంచేస్తున్న స్వీడన్‌కు చెందిన 16ఏళ్ల గ్రెటాథన్‌బర్గ్ “నోర్డియాక్ కౌన్సిల్” ప్రకటించిన “ఎన్విరాన్మెంటల్ అవార్డు”ని తిరస్కరించింది. ప్రపంచ నేతల్ని ఐరాస వేదికగా పర్యావరణ మార్పులపై అశ్రద్ధగా ఉండడానికి మీకెంత ధైర్యం అని ప్రపంచ నేతల్ని కడిగి పారేసింది. పర్యావరణ ప్రేమికురాలు అయిన గ్రెటా థన్‌బర్గ్ మరోసారి నాయకుల తీరుపై తన అసంతృప్తిని తెలియ చేసింది.
నోర్డియాక్ కౌన్సిల్లో సభ్యులుగా 84దేశాలు ఉన్నాయి. నాయకులు దృష్టి పెట్టాల్సింది అవార్డుపై కాదంటూ దాదాపు 36లక్షల నగదు బహుమతి అందించే ఎన్విరాన్మెంటల్ అవార్డుని తిరస్కరించింది. ఇన్స్టాగ్రామ్ వేదికగా “పర్యావరణంపై అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు, ప్రజల పరిష్కార మార్గాలపై దృష్టి పెట్టాలని, పర్యావరణంపై చేస్తున్న పోరాటానికి అవార్డులు అనవసరం” అని తెలిపింది.
నోర్డియాక్ కౌన్సిల్‌కు సమస్యలపై సరిగా స్పందించడం లేదని ఇంకా తన పోరాటాన్ని గుర్తించినందుకు కృతజ్ఞతలు చెప్పింది. స్వీడన్ పార్లమెంట్ ఎదుట గ్రెటా థన్‌బర్గ్ ఒంటరిగా ధర్నా చేసినపుడు ప్రపంచ వ్యాప్తంగా విద్యార్థులు మద్దతు నిలిచారు. ఐరాసలో తాను చేసిన ప్రసంగం ప్రజల్ని ఆలోచింపజేసింది.