మరికొన్ని గంటల్లో పెళ్లికూతురు మెడలో తాళి కట్టాల్సిన వరుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన మహబూబ్‌నగర్ చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని క్రిష్టియన్పల్లిలో నివాసముండే చైతన్య అనే ఉపాద్యాయుడికి నేడు 11 గంటలకు పెళ్లి జరగాల్సి ఉంది. కాగా, తన పెళ్లికి హాజరయ్యేందుకు వచ్చిన స్నేహితులను రిసీవ్ చేసుకునేందుకు జడ్చర్లకు స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాడు.
జడ్చర్ల మండలం నక్కల బండ తండా వద్ద కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వరుడు చైతన్య అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో పెళ్లింట విషాదం ఛాయలు అలుముకున్నాయి. మృతుడు నారాయణపేట జిల్లా తిరుమలాపూర్ గ్రామ ప్రైమరీ స్కూల్ టీచర్‌గా పనిచేస్తున్నాడు. మరికాసేపట్లో పెళ్లి జరగాల్సి ఉండగా స్నేహితుల కోసం వెళ్లి రోడ్డు ప్రమాదంలో వరుడు మృతి చెందడం అందరినీ కలచివేసింది. ఇరు కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.