అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

Guest lecturers recruitement

తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించి అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి బి.జయప్రదబాయి ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ జిల్లాలోని మొత్తం 24 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 110 ఖాళీలు ఉన్నాయని, ఆసక్తి ఉన్నవారు ఈనెల 8వ తేదీ నుంచి 14 వరకు ఆన్‌లైన్‌లో www.cie.telangana.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థుల ఎంపికను పీజీలో సాధించిన మెరిట్ ఆధారంగా జరుగుతుందని, స్థానికులకు ప్రాధాన్యత ఉంటుందన్నారు.