అనారోగ్యంతో బాధ పడుతున్న గుజరాత్ మాజీ ముఖ్య మంత్రి దిలీప్ పరిఖ్ కన్నుమూశారు. మొదట్లో పారిశ్రామిక వేత్తగా అధ్యక్షుడిగా గుజరాత్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్‌కి కి ఉండేవారు. భాజపా ఎమ్మెల్యేగా 1990లో రాజకీయాల్లోకి ప్రవేశించి గెలుపు సాదించారు. శంకర్ సిన్హ్ వాఘేలా రాష్ట్రీయ జనతా పార్టీ స్థాపించగ తర్వాత వాఘేలా కాంగ్రెస్ పార్టీ సహకారంతో గుజరాత్ ముఖ్య మంత్రిగా 1996లో గెలిచారు. 1997లో కాంగ్రెస్‌తో విభేదాల వల్ల దిలీప్ సీఎంగా దిగిపోవల్సి వచ్చింది.
దిలీప్ పరిఖ్ మృతి పట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తు అంకిత భావంతో ప్రజాసేవ చేశారని చెప్పారు. ప్రస్తుత గుజరాత్ ముఖ్య మంత్రి విజయ్ రూపానీ సైతం నివాళులు అర్పించారు. సుదీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న దిలీప్ పరిఖ్ చికిత్స పొందుతూ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు.