ఇంట్రెస్టింగ్ టైటిల్ గ్లింప్స్ తో గుణశేఖర్ నెక్స్ట్ మూవీ ..!

Gunasekhar's next movie with interesting title glimpses..!
Gunasekhar's next movie with interesting title glimpses..!

మన టాలీవుడ్ తన మూవీ లతో తనదైన ముద్ర వేసిన దర్శకుల్లో గుణశేఖర్ కూడా ఒకరు. భారీ సెట్టింగ్ లు గ్రాఫిక్ లతో అప్పట్లోనే ఒక ట్రెండ్ సెట్ చేసిన గుణశేఖర్ నుంచి రీసెంట్ గా వచ్చిన భారీ మూవీ “శాకుంతలం”. స్టార్ హీరోయిన్ సమంత (Samantha) నటించిన ఈ మూవీ అనుకున్న రేంజ్ లో విజయం సాధించలేకపోయింది. ఇక ఈ మూవీ తర్వాత మరో వినూత్న ప్రయత్నంతో గుణశేఖర్ రాబోతున్నట్టుగా అనిపిస్తుంది.

తన దర్శకత్వం తమ బ్యానర్ నుంచి రాబోతున్న నెక్స్ట్ మూవీ నే “యుఫోరియా”. ఒక ఇంట్రెస్టింగ్ టైటిల్ గ్లింప్స్ తో అయితే మేకర్స్ ఇప్పుడు దీనిని రివీల్ చేయగా క్రేజీ బ్యాక్గ్రౌండ్స్ స్కోర్ మరియు ఇంట్రెస్టింగ్ విజువల్స్ తో ఒక కొత్త ప్రయత్నంలా అనిపిస్తుంది. ఇక ఈ మూవీ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ బయటకు రానుండగా షూటింగ్ అయితే త్వరలోనే మొదలు పెడతారట. మరి ఈసారి గుణశేఖర్ ఎలాంటి మూవీ తో రాబోతున్నారో అనేది చూడాల్సిఉంది .