భారత్ ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ఫోన్ చేశారు. పాకిస్థాన్ వైఖరిపై అరగంట పాటు మాట్లాడారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేస్తున్న వ్యాఖ్యలు శాంతికి విఘాతం కలిగించేలా ఉన్నాయని చెప్పారు మోడీ. కశ్మీర్లో హింసకు తావిచ్చే ప్రకటనలు చేస్తోందని ఆరోపించారారు.
ఆర్టికల్ రద్దుతోపాటు విభజన తర్వాత కాశ్మీర్ అంశం హాట్ టాపిక్ గా మారింది. పాకిస్థాన్ ఈ అంశాన్ని అంతర్జాతీయం చేయాలని ప్రయత్నాలు చేసింది. ఐక్యరాజ్య సమితి భద్రతా సమితికి పిర్యాధు చేసింది. చైనాకు, అమెరికాకు ఇమ్రాన్ ఫోన్లో పిర్యాధు చేశారు.
దీంతో చాలాఏళ్ల తర్వాత కాశ్మీర్‌పై మరోసారి రహస్య మీటింగ్ జరిగింది. అయితే అత్యవసరంగా జరిగిన సమావేశం అయినప్పటికి ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్‌కు ఎలాంటీ మద్దతు లభించకపోవడంతో భారత్‌కు ఉపశమనం కల్గింది. ఈ తరుణంలో మోడీ కాశ్మీర్ అంశంలో పాకిస్థాన్‌ను ఒంటరి చేసేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్నారు.
కొద్దిరోజులుగా ఇమ్రాన్ ఖాన్ వివాదాస్పద, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ప్రకటనలు చేస్తున్నారు. దీనిపై భారత్ కూడా ఘాటుగానే స్పందిస్తోంది. తాజాగా పాక్ తీరుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ఫోన్ లో సంభాషించారు.
దాదాపు అరగంట పాటు సాగిన ఈ సంభాషణలో కాశ్మీర్ వ్యవహారంపై ట్రంప్‌తో చర్చించారు మోడీ. భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. అలాగే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపైనా చర్చలు జరిపారు.
రెచ్చగొట్టేలా చేస్తున్న వ్యాఖ్యలు శాంతికి అనుకూలంగా లేవని మోడీ ట్రంప్‌తో అన్నట్టు సమాచారం. ఉగ్రవాద నిర్మూలన, అంతర్జాతీయ ఉగ్రవాదంతో పాటు, ప్రాంతీయంగా ఉన్న పేదరికం నిరక్షరాస్యత అంశాలపై చర్చించారు. ట్రంప్, మోడీల మధ్య సంభాషణ స్నేహపూర్వకంగా సాగిందని ప్రధాన మంత్రి కార్యాలయం ప్రకటన విడుదలచేసింది.