ఆన్‌లైన్లో చేనేత వస్త్రాలు

సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి

చేనేత రంగం అభివృద్ధికి ఇచ్చిన హామీని సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ తో ఒప్పందం ఇంకా ”వైఎస్సార్‌చేనేతనేస్తం” పేరిట 24వేల రూపాయాలని ప్రతిఏటా చేనేత కార్మికులకి అందించేందుకు ఏర్పాట్లు మొదలు పెట్టారు. నవంబర్‌ 1నుంచి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ ఆన్‌లైనలో చేనేత వస్త్రాల అమ్మకాలు జరుగనున్నాయి. దేశానికే కాకుండా విదేశాలకు కూడా చేనేత ఉత్పత్తులను తీసుకెళ్లే విధంగా ఆన్లైన్ మార్కెటింగ్‌ సౌకర్యాన్నితేవడం తో ఇచ్చిన హామీని సీఎం  జగన్‌ మోహన్‌రెడ్డి నిలుపుకున్నారు.

ధర్మవరం, ఉప్పాడ, వెంకటగిరి చీరలు, చేనేత డ్రస్‌ మెటీరియల్స్‌ ఇంకా చొక్కాలు, ధోవతులు నాణ్యమైన చేనేత ఉత్పత్తులు ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేసుకునేలా జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకోబోనున్నది. ఇప్పటికే ప్రముఖ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్టు లాంటి ఆన్లైన్ పోర్టల్స్ తో ఒప్పందం చేసుకుంది. వస్త్రాలను చేనేత సహకార సంఘాల నుంచి ఆప్కో కొనుగోలు చేసి ఆన్‌లైన్‌ ద్వారా అమ్మకాలను చేయనుంది.

నవంబర్‌ 1వ తేదీ నుంచి తొలి దశలో 25రకాల చేనేత ఉత్పత్తులను అమెజాన్‌ ద్వారా అమ్మకాలు జరపనున్నారు.500 నుంచి 20వేల వరకు ధర ఉన్న వాటిని అందుబాటులోకి తెచ్చి ప్రాచూర్యం ఉన్న ధర్మవరం, ఉప్పాడ, మంగళగిరి, వెంకటగిరి ప్రాంతాల్లో తయారయ్యే చేనేత ఉత్పత్తులను అమ్మకాలకి ఉంచనున్నారు.